భూటాన్‌లో హిమానీన‌దం విస్ఫోట‌నం

 
* బెంగాల్‌, అస్సాంల‌కు వ‌ర‌ద ముప్పు.. కేంద్రం హైఅల‌ర్ట్‌..!
వాయవ్య భూటాన్‌లోని గాసా జిల్లా పరిధిలోగల ప్రసిద్ధ షింటాఫు సరస్సు వద్ద హఠాత్తుగా సంభవించిన హిమానీనద సరస్సు విస్పోటనం.. ఆ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. గురువారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామం వల్ల మో చూ నది ఉగ్రరూపం దాల్చి భారీగా ప్రవాహం పెరిగింది. ఈ ఆకస్మిక వరదల దాటికి మో చూ నది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ సహజ వేడినీటి బుగ్గల ప్రాంగణమైన గాసా ట్షాచు పూర్తిగా కొట్టుకుపోయింది.  
 
ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన యంత్రాంగం సదరు ప్రాంతం నుంచి ప్రజలను, యాత్రికులను ఖాళీ చేయించడంతో పెద్ద ఎత్తున జరగాల్సిన ప్రాణనష్టం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.  భూటాన్ ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కేంద్ర జల సంఘం (కింద పనిచేసే ఫ్లడ్ ఫోర్‌కాస్ట్ మానిటరింగ్ డైరెక్టరేట్ వెంటనే స్పందించి పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌ద్వార్, అస్సాంలోని ధుబ్రి జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. 
 
పునాట్సాంగ్‌ఛూ (భారత్‌లో సంకోష్ నది) ఎగువ ప్రాంతాలలో ఏర్పడిన ఈ వరద నీరు మరో ఆరు నుంచి ఎనిమిది గంటల వ్యవధిలో దిగువకు చేరుకుని సరిహద్దు జిల్లాలలో నీటిమట్టాలను ఒక్కసారిగా పెంచే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, జల్ పాయిగురి, కూచ్ బెహార్ జిల్లాలతో పాటు అస్సాంలోని ధుబ్రి జిల్లా యంత్రాంగం నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో నిమగ్నమైంది. 
 
భూటాన్‌లో హిమానీనద సరస్సు విస్ఫోటనం వల్ల సంభవించే ప్రభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని, ధుబ్రి,  కోక్రాఝర్ జిల్లాల్లోని సున్నితమైన రెవెన్యూ సర్కిళ్లపై నిఘా ఉంచామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ఎలాంటి పరిస్థితికైనా సన్నద్ధంగా ఉండేందుకు యంత్రాంగం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం  కోక్రాఝర్‌లోని అన్ని సున్నితమైన రెవెన్యూ సర్కిళ్లపై సంభవించే ప్రభావాన్ని మేము నిశితంగా పర్యవేక్షిస్తున్నాము.”
అస్సాంలోని ధుబ్రి, పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలాగే అలీపుర్‌దువార్, జల్‌పాయిగురి జిల్లాలు ఈ ముప్పు పొంచి ఉన్న వాటిలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో, సంకోష్ నది ఒడ్డున ఉన్న‌ ప్రజలు ఖాళీ చేయాల‌ని అధికారులు హెచ్చ‌రించారు.

About The Author