ఇండోర్‌లో ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్

 
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వార్షిక ‘అఖిల భారతీయ కార్యకారి మండల్’ బైఠక్ ఈ సంవత్సరం ఇండోర్ నగరం (మధ్యప్రదేశ్), మాల్వా ప్రాంత్‌లో నవంబర్ 2,3,4  తేదీలలో జరుగుతోందని అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్  సునీల్ అంబేకర్ తెలిపారు. 
 
సర్ సంఘచాలక్  డాక్టర్ మోహన్ భగవత్ జీ, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే జీ, మొత్తం ఆరుగురు సహ-సర్కార్యవాహులు, ఇతర అఖిల భారతీయ కార్యవర్గ ప్రముఖులు, కార్యకారిణి సభ్యులు ఈ బైఠక్‌లో పాల్గొంటారు. అఖిల భారతీయ కార్యకారి మండలంలో, సంఘ్ సంస్థాగత నిర్మాణంలోని మొత్తం 46 ప్రాంతాల నుండి  ప్రాంత్ సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్ లు, సహప్రాంత  సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్ లు పాల్గొంటారు. 
 
సంఘ్ సంస్థాగత నిర్మాణంలోని మొత్తం 11 క్షేత్రాల నుండి, సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లతో పాటు సహ-క్షేత్ర సంఘచాలక్‌లు, కార్యవాహులు, ప్రచారక్‌లు కూడా ఉంటారు. ఇటీవల ముగిసిన విజయదశమి పండుగతో, సంఘ్ శతాబ్ది సంవత్సరంలో భాగంగా గత ఏడాది దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల పరంపర ముగిసింది. 
 
సర్ సంఘచాలక్ జీ ఈ ఏడాది విజయదశమి ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై తదుపరి చర్యలపై సమావేశంలో చర్చించనున్నారు. శతాబ్ది ఉత్సవాల్లో నిర్వహించే అన్ని కార్యక్రమాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. అంతేకాకుండా, కొత్త మీడియా వేదికల్లోని కంటెంట్, మాదకద్రవ్యాల వినియోగంపై పెరుగుతున్న ఆందోళనలు, భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో బాహ్య జోక్యం, ప్రపంచ పరిస్థితులు వంటి కీలకమైన సమకాలీన అంశాలపై విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది.

About The Author