భారత్‌కు ఆరంభంలోనే వికెట్ నష్టపోయినా షఫాలీ వర్మ దూకుడుతో ఇన్నింగ్స్ వేగం అందుకుంది. జింబాబ్వే బౌలర్లను లక్ష్యంగా చేసుకున్న ఆమె ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడింది. ఆమె ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ దూకుడుతో భారత స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. మరోవైపు హర్మన్‌ప్రీత్ కౌర్ ఆరంభంలో ఆచితూచి ఆడినా, కుదురుకున్నాక జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. బంతిని బౌండరీకి తరలిస్తూ, భారీ సిక్సర్లతో విరుచుకుపడింది.
కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్న హర్మన్ చివరి వరకు అదే జోరు కొనసాగించింది. 35 బంతుల్లో 81 పరుగులు చేసి భారత భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. షఫాలీ, హర్మన్ దూకుడుతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు.
క్రాంతి గౌడ్ తొలి బంతికే కెలిస్ ఎన్డ్లోవును పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత నందిని శర్మ మోడెస్టర్ ముపాచిక్వాను ఔట్ చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచింది. దీంతో జింబాబ్వే ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షర్నే మేయర్స్, బెలవ్డ్ బిజా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. మేయర్స్ ధాటిగా ఆడుతూ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. 49 బంతుల్లో 60 పరుగులు సాధించి అర్ధశతకంతో మెరిసింది. బిజా 50 బంతుల్లో 44 పరుగులు చేసి పోరాడింది. అయితే భారీ లక్ష్యం ముందు వారి ప్రయత్నం సరిపోలేదు. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోవడంతో జింబాబ్వే ఒత్తిడిలో పడింది. మేయర్స్ ఔటైన తర్వాత జట్టు విజయంపై ఆశలు సన్నగిల్లాయి.

More Stories
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు ‘త్వరలోనే’
కోయంబత్తూరు బాంబు దాడుల ఉగ్రవాదులకు విజయ్ బెయిల్!
మోదీ, షా ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం శుభాకాంక్షలు