బాలీవుడ్ యువ నటుడు టైగర్ ష్రాఫ్ ఆదివారం సాయంత్రం త్రుటిలో హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు. ముంబయిలోని జూహూ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన వాహనంపై కాల్పుల జరిపారు. ఈ ఘటనలో టైగర్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడగా, ఆయన కార్ డ్రైవర్ గాయపడ్డారు. ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి ఆయన తిరిగి బయలుదేరుతున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు నివేదికలు తెలిపాయి.
దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దాడి జరిగిన కొద్దిసేపటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సంధులుగా తమను తాను పరిచయం చేసుకున్న ఒక వ్యక్తులు ఓ వీడియోను విడుదల చేశాడు. తమ సూచనలను పాటించకుండా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేస్తున్నందున టైగర్ ష్రాఫ్ తమ హిట్‌లిస్ట్‌లో ఉన్నాడని అతడు పేర్కొన్నాడు.
ప్రస్తుతం గుజరాత్ జైలులో ఉన్న బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపుతామని పదేపదే బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు సినిమాలో కలిసి నటించనప్పటికీ, వారి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ద్వారా టైగర్ ష్రాఫ్ బాలీవుడ్‌కు పరిచయం కావడానికి సల్మాన్ ఖాన్ కారణమని చెబుతారు. టైగర్ ష్రాఫ్ తండ్రి జాకీ ష్రాఫ్ కూడా సల్మాన్‌తో కలిసి పలు భారీ చిత్రాల్లో నటించారు.
వీరిద్దరూ పలు వేదికలను పంచుకోవడమే కాకుండా ఫిట్నెస్, యాక్షన్ సినిమాల పట్ల ఒకరికొకరు ఉన్న అంకితభావాన్ని తరచుగా ప్రశంసించుకునేవారు. దాడి జరిగిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఆడియో క్లిప్‌లో ఒక వ్యక్తి హిందీలో మాట్లాడుతూ ‘‘నేను అనిల్ పండిట్‌ను. నేను లారెన్స్ బిష్ణోయ్‌కి తమ్ముడిలాంటివాడిని. ఈరోజు టైగర్ ష్రాఫ్‌తో జరిగిన ఘటనకు నేనూ, హర్మాన్ సంధూ బాధ్యత వహిస్తున్నాం’’ అని పేర్కొన్నాడు. టైగర్ ష్రాఫ్‌కు ‘నచ్చజెప్పడానికి ప్రయత్నించాం, కానీ ఆయన అర్థం చేసుకోలేదు’ అని అతడు ఆ సందేశంలో అన్నాడు.
‘‘మొత్తం సినీ పరిశ్రమలో మాకు అనుకూలంగా పనిచేయని వారు లేదా సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే ఎవరినైనా అంతమొందిస్తాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్” అని హెచ్చరించాడు. 1998 నాటి కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ జంతు ప్రేమికులైన బిష్ణోయ్ సమాజానికి క్షమాపణలు చెప్పకపోతే ‘‘మీ కుటుంబంలోని ఎవరినీ, చివరికి మీ పెంపుడు కుక్కలను కూడా విడిచిపెట్టబోం’’ అని లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు పాల్పడ్డాడు.

More Stories
జింబాబ్వేపై భారత్ మహిళా జట్టు ఘన విజయం- సిరీస్ కైవసం
ఇస్లాం అనుసరించాలని, ఖురాన్ చదవాలని కోరిన సింబయాసిస్ ప్రొఫెసర్
చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం అందించిన ఓ ఆర్మీ అధికారి భార్య