కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈడీ సీఎంఎల్ఆర్ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 23న విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో కేరళ హైకోర్టును ఈడీ ఆశ్రయించింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ కేసులో మాజీ సీఎం విజయన్‌తోపాటు ఆయన కూతురు వీణా విజయన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేసు విచారణ కోసం కోచిలోని తమ కార్యాలయంలో అక్టోబర్ 23న హాజరు కావాలని విజయన్ను ఈడీ ఆదేశించింది. అయితే, తమపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ విజయన్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మేలో ఈడీ అధికారులు సీఎంఆర్ఎల్ సంస్థ ప్రమోటర్లపై దాడులు జరిపారు.
దీనిలో భాగంగా విజయన్ కూతురు వీణా విజయన్ ఇంటిపై కూడా దాడులు జరిపారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్లు లభించాయి. ఇండియా నుంచి భారీ ఎత్తున డబ్బు దుబాయ్, విదేశాలకు తరలించినట్లుగా ఆ డాక్యుమెంట్లలో ఉంది. 3.49 లక్షల యూఏఈ దిర్హామ్స్ (రూ.85 లక్షలు) దుబాయ్‌కు తరలించారు. అలాగే, ఇండియా నుంచి రూ.20.05 కోట్ల భారత కరెన్సీ కూడా విదేశాలకు తరలించారు.
హవాలా లావాదేవీల ద్వారా ఈ సొమ్మును విదేశాలకు తరలించినట్లు ఈడీ అనుమానిస్తోంది. విజయన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన పాత్రపై కూడా ఈ విషయంలో అనుమానాలున్నాయి. ప్రభుత్వం నుంచి సీఎంఆర్ఎల్ సంస్థకు లబ్ధి చేకూరినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. పినరయి విజయన్, వీణా విజయన్‌పై కేసు నమోదు చేయాలని కోర్టును ఈడీ ఆశ్రయించింది. దీంతో తాజాగా పినరయి విజయన్‌కు సమన్లు జారీ చేసింది.

More Stories
ఐఏఎఫ్‌కు సొంత ఉపగ్రహం.. రూ. 2,563 కోట్ల ఒప్పందంపై సంతకం
రక్షణ ఒప్పందం ముడుపుల కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
అమెరికా వాణిజ్య ఒప్పందం మొదటి దశ ఖరారు.. త్వరలో ముసాయిదా