మహమ్మద్ యూనస్‌కు న్యూయార్క్ విమానాశ్రయంలో నిరసనలు

 
బంగ్లాదేశ్ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ మహమ్మద్ యూనస్‌ను అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవాస బంగ్లాదేశీయులనుండి నిరసనను ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం 3:45 గంటల ప్రాంతంలో యూనస్ విమానాశ్రయం నుండి బయలుదేరుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆయనతో పాటు తాత్కాలిక ప్రభుత్వ ఎస్డీజీల ప్రధాన సమన్వయకర్త, యూనస్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లమియా మోర్షెడ్ కూడా ఉన్నారు. 

ప్రధాన సలహాదారు పదవి నుంచి వైదొలిగిన తర్వాత, నోబెల్ బహుమతి గ్రహీత అయిన యూనస్ విదేశాలకు వెళ్లడం ఇదే మొదటిసారి. ఆయనపైనా, ఆయన గ్రామీణ్ గ్రూప్‌పైనా అవినీతి నిరోధక విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక వ్యక్తి యూనస్‌ను ఉద్దేశించి “నువ్వు ఒక ఉగ్రవాదివి. నువ్వు బంగ్లాదేశ్‌లో ప్రజలను చంపావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాకు చెప్పు, ఎందుకు వచ్చావు?” అని అరుస్తూ వినిపించాడు.

 
ఉద్రిక్తమైన ఈ ఘర్షణ, గుంపు దాడి తరువాత, యూనస్‌ను వీల్‌చైర్‌లో వెనక్కి టెర్మినల్ లోపలికి తీసుకువెళ్లారు. వేలాది మంది పోలీసు సిబ్బంది మరణాలకు యునుస్ కారణమని నిరసనకారులు ఆరోపించారు, అలాగే బంగ్లాదేశ్‌లో సుమారు రెండు లక్షల మందిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. కొన్ని నివేదికల ప్రకారం, ఆయన దోహా నుండి ఖతార్ ఎయిర్‌వేస్ విమానంలో టెర్మినల్ 8కి చేరుకున్న తర్వాత ఈ ఘర్షణ జరిగింది.
 
అతడిని వీల్‌చైర్‌లో విమానాశ్రయం నుంచి బయటకు తీసుకువస్తుండగా, ప్రజలు అతడిపై కేకలు వేస్తున్న దృశ్యాలు ఆ ఫుటేజ్‌లో కనిపించాయి. కొందరు అతడిని “వెనక్కి వెళ్ళిపో” అని కూడా డిమాండ్ చేశారు. అంతకుముందు, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న “అణచివేత”, “మారణహోమం”కు వ్యతిరేకంగా కొన్ని సంస్థలు సిమ్లాలో ప్రదర్శన నిర్వహించి, అప్పటి మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు యూనుస్‌కు ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి.
 
 ‘డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్’  బ్యానర్ కింద సామాజిక సంస్థలు కూడా వీరితో చేరాయి. బంగ్లాదేశ్‌లో హిందూ సమాజ సభ్యులపై, వారి ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. “ఆగస్టు 8న మహమ్మద్ యూనస్ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి హిందువులపై, వారి ప్రార్థనా స్థలాలపై దాడులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 
 
1971లో బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు ముక్తి వాహినికి, షేక్ ముజిబుర్ రెహమాన్‌కు మద్దతు ఇచ్చిన బంగ్లాదేశ్‌లోని హిందూ సమాజాన్ని అన్యాయంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని డీఆర్‌హెచ్ కన్వీనర్ అజయ్ శ్రీవాస్తవ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
 

About The Author