ఎన్నికల జాబితాల ఎస్ఐఆర్ లో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్త పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (పవార్) (ఎన్‌సిపి-ఎస్‌సిపి) నాయకురాలు సుప్రియా సూలే, శివసేన-యూబీటీ నాయకుడు సంజయ్ రౌత్, మరికొందరు ప్రతిపక్ష నాయకులు కూడా ఈ పిటిషన్‌లో పిటిషనర్లుగా ఉన్నారు.
ఈ పిటిషన్‌లో భారత ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషిలను కూడా ప్రతివాదులుగా చేర్చారు. ఎస్‌ఐఆర్ సమయంలో చేసిన తొలగింపులు, మార్పులపై ఒక నిర్దిష్ట సమయంలోగా స్వతంత్ర ఆడిట్ నిర్వహించడానికి, విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో, సాంకేతిక నిపుణులు, ఇతర ప్రముఖ పౌరుల సహాయంతో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు.
చట్టానికి అనుగుణంగా నోటీసు ఇవ్వకుండా, సహేతుకమైన విచారణ అవకాశం కల్పించకుండా ఏ ఓటరును కూడా ఓటర్ల జాబితా నుండి తొలగించకూడదని, అలాగే పంజాబ్, ఎన్నికలకు వెళ్తున్న ఇతర రాష్ట్రాల్లోని అర్హులైన వ్యక్తులు, చట్టం అనుమతించిన చివరి తేదీ వరకు ఓటర్ల జాబితాలో చేర్చబడటానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని కూడా అది ఆదేశించాలని కోరారు.

More Stories
సిజెఐ రాజీనామా కోరుతూ కేరళ కాంగ్రెస్ ఎక్స్ పోస్టుపై దుమారం
కర్ణాటకలో బీజేపీలో చేరేందుకు 25 మంది ఎమ్యెల్యేలు సిద్ధం?
రాజస్థాన్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్ను వివస్త్రుడిని చేసి కొట్టారు