కార్గిల్ అమరవీరుని భార్య సుధా యాదవ్ కర్ణాటక గవర్నర్

* ఆరు రాష్ట్రాలకు గవర్నర్లు నియామకం 
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఆరు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు.  సిక్కిం, ఒడిశా, కేరళం, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను నూతన గవర్నర్ లను ముర్ము నియమించారు. ఇందులో భాగంగా హర్యానాకు చెందిన ప్రముఖ బీజేపీ నేత సుధా యాదవ్‌ను కర్ణాటక కొత్త గవర్నర్‌గా ఎంపిక చేశారు. బీజేపీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన పార్లమెంటరీ బోర్డులో ఏకైక మహిళా సభ్యురాలైన సుధా యాదవ్, తన కుమారుడు సిద్ధార్థ్, యాదవ్ బీజేపీ మీడియా సహ-ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన కొద్ది రోజులకే ఈ కీలక గవర్నర్ పదవిని చేపట్టనున్నారు.

 
మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ మాజీ లోక్‌సభ ఎంపీ ధల్ సింగ్ బిసెన్, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ స్థానంలో ఉత్తరాఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీకి చెందిన మాజీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , పార్టీ సీనియర్ దళిత నేత దుష్యంత్ గౌతమ్, సిక్కిం కొత్త గవర్నర్‌గా వ్యవహరించనున్నారు. కేరళ గవర్నర్‌గా ఉన్న రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆ రాష్ట్ర గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

About The Author