జపాన్ మాజీ ప్రధానమంత్రి (దివంగత) షింజో అబే సతీమణి శ్రీమతి అకీ అబే, నిప్పన్ కైగీ ఛైర్మన్ తోమోహికో తనిగుచి న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ కార్యాలయం కేశవ్ కుంజ్‌లో, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలెను కలిశారు. ఈ సమావేశంలో, నాగరిక బంధాలు, సాంస్కృతిక సహకారం, ప్రజల కేంద్రీకృత కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
భారత్-జపాన్ సంబంధాలను బలోపేతం చేయడంపై ఆత్మీయంగా, సవివరంగా అభిప్రాయాలను పంచుకున్నారు. శ్రీమతి అబే, హోసబాలె ఇద్దరూ ఈ రంగాలలో సహకారానికి మార్గాలను అన్వేషిస్తారు. ఫౌండేషన్ ఫర్ సోషల్ కాంట్రిబ్యూషన్ ఛైర్పర్సన్ శ్రీమతి అబే , ప్రముఖ జపనీస్ ప్రభుత్వేతర సంస్థ అయిన నిప్పన్ కైగీ ఛైర్పర్సన్ తోమోహికో తనిగుచి, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంపొందించుకోవాలనే ఉమ్మడి ఆసక్తిని ప్రతిబింబిస్తూ, గంటకు పైగా సంభాషించారు. భారత్, జపాన్ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఆర్ఎస్ఎస్ నాయకత్వం, ఫౌండేషన్ ఫర్ సోషల్ కాంట్రిబ్యూషన్ నిప్పన్ కైగీ ప్రతినిధి బృందం అంగీకరించాజపాన్ల యి.
శ్రీమతి అకీ అబే, ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన రోజే ఈ భేటీ జరగడం గమనార్హం. భారత్- జపాన్ సంబంధాలను నిర్ణయాత్మక దశకు తీసుకెళ్లిన గొప్ప దార్శనికత గల నేత షింజో అబే అని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో అబే మెమోరియల్ కారిడార్ ప్రారంభోత్సవం, భారత్-జపాన్ స్నేహానికి షింజో అబే చేసిన శాశ్వతమైన సేవకు తగిన నివాళి అని మోదీ పేర్కొన్నారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో మోదీ ఇలా తెలిపారు:
“దివంగత జపాన్ మాజీ ప్రధాని షింజో అబే సతీమణి శ్రీమతి అకీ అబేను కలవడం ఆనందంగా ఉంది. భారతదేశంతో ఆమెకున్న శాశ్వత అనుబంధాన్ని నేను ఎంతగానో గౌరవిస్తాను. అబే సాన్ ఒక ప్రియమైన స్నేహితుడు, దార్శనిక నాయకుడు. భారత్-జపాన్ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. నిన్న వారణాసిలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్లో అబే మెమోరియల్ కారిడార్ ప్రారంభోత్సవం, భారత్-జపాన్ స్నేహానికి ఆయన చేసిన శాశ్వతమైన సేవకు తగిన నివాళి.”

More Stories
ఢిల్లీ అల్లర్ల కేసులో ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ దోషి!
అశాంతిని ప్రేరేపిస్తున్న రాహుల్, కేజ్రీవాల్
పోలీసుల అదుపులో అభిజీత్ దీప్కే