సౌదీ అరేబియా రాజధాని రియాద్ నగరంపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతుతున్నాయి. తాజాగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేశారు. బాలిస్టిక్ మిస్సైళ్లతో ఎయిర్‌పోర్టుపై దాడి చేసినట్లు హౌతీలు ప్రకటించారు. దీంతో ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమానాల ప్రయాణం, భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
దాడి నేపథ్యంలో ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో రియాద్ వెళ్లే అనేక అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు రద్దు చేసుకుంటున్నాయి. ఇండియా నుంచి రియాద్ వెళ్లే విమాన సర్వీసుల్ని అక్టోబర్ 10 వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ప్రకటించాయి.
ఆయా సంస్థలు. విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ అందిస్తామని ప్రకటించాయి. ఈ ప్రకటనకు ముందు ఢిల్లీ నుంచి రియాద్ బయల్దేరిన విమానాన్ని తిరిగి వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అవ్వాల్సిన ఎయిర్‌పోర్టుపై మిస్సైల్ దాడులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. కోచి నుంచి రియాద్‌కు వెళ్లాల్సిన రెండు విమానాలు కూడా రద్దయ్యాయి. హౌతీ దాడుల కారణంగా సౌదీ ప్రభుత్వం రియాద్ ఎయిర్‌పోర్టును మూసేసింది.
ఇటీవలి సౌదీ విమానాశ్రయాలు, సైనిక, చమురు కేంద్రాలపై ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు పదేపదే దాడులు చేసినట్లు ప్రకటించారు. గురువారం తెల్లవారుజామున, సౌదీ గగనతలాన్ని తమ సైనిక కార్యకలాపాలకు వేదికగా అభివర్ణిస్తూ అక్కడ కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ప్రపంచ విమానయాన సంస్థలను చివరిసారిగా హెచ్చరించారు.
కొద్ది రోజులుగా సౌదీపై హౌతీ ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. మంగళవారం, బుధవారం సౌదీపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించారు. హౌతీలు.. యెమెన్ దేశంలోని తిరుగుబాటు సంస్థకు చెందిన ఉగ్రవాదులు. వీరు పొరుగునే ఉన్న సౌదీపైనే కాదు, సొంత దేశం యెమెన్‌లోని ప్రభుత్వంపై, అక్కడి సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు. యెమెన్‌లోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వీరికి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉంటోంది. హౌతీలను ఉగ్ర సంస్థగా పేర్కొంటారు
రెండు రోజుల వ్యవధిలో రెండు విమానాశ్రయాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మృతిచెందగా, 36 మంది గాయపడ్డారు. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇద్దరు, రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలు, యెమెన్‌లోని హూతీ గ్రూప్ మధ్య మళ్లీ పోరాటం తీవ్రమైన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.
రెండు రోజుల వ్యవధిలో రెండు విమానాశ్రయాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మృతిచెందగా, 36 మంది గాయపడ్డారు. అభా అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఇద్దరు, రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒకరు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా మద్దతు ఉన్న ప్రభుత్వ బలగాలు, యెమెన్‌లోని హూతీ గ్రూప్ మధ్య మళ్లీ పోరాటం తీవ్రమైన నేపథ్యంలో ఈ తాజా దాడులు చోటుచేసుకున్నాయి.
‘‘మా దేశంపై సౌదీ అరేబియా జరుపుతున్న దాడికి నిరసనగా’’ ఈ దాడులు చేసినట్లు హూతీ మిలటరీ ప్రతినిధి యాహ్యా సారీ తెలిపారు. గత 24 గంటల్లో సౌదీ అరేబియా తమపై 60 వైమానిక, క్షిపణి దాడులు చేసిందని ఆయన ఆరోపించారు. సౌదీ వైమానిక ప్రాంతం ప్రస్తుతం తమ మిలటరీ చర్యలకు వేదికగా మారింది అని పేర్కొంది. ‘కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని తాకింది, దీనివల్ల విమానాశ్రయ కార్యకలాపాలకు విఘాతం కలిగింది’ అని సారీ పేర్కొన్నారు.

More Stories
జీఎస్టీ అధికారుల అరెస్ట్ అధికారాలను రద్దు
కెనడా రచయిత్రి అన్నే కార్సన్‌కు సాహిత్యంలో నోబెల్
`ఓట్ల చోరీ’ ఆరోపణలు ఆధార రహిత ప్రచారం