లింగమనేని రమేశ్,
పార్లమెంట్ సభ్యులు (రాజ్యసభ), జనసేన పార్టీ
ఒక సాధారణ కుటుంబం నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ రాజకీయ ప్రయాణం భారత రాజకీయాల్లో ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచింది. “ప్రధాన మంత్రి అయినప్పుడు మోదీకి కేంద్ర స్థాయిలో గానీ, పార్లమెంట్ లో గానీ ఎలాంటి అనుభవం లేదు. అయినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంలోని సంక్లిష్టమైన పరిపాలనా యంత్రాంగంపై ఆయన చాలా వేగంగా పట్టు సాధించారు. దేశం కోసం తాను ఏమి చేయాలో నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్ధేశించుకున్న ఆయన అపారమైన అంకితభావంతో స్పష్టమైన వైఖరి ప్రదర్శించారు.”అని 2014లో నాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మోదీపై చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని పుష్కర పాలనలో నిరూపితమైంది.

“ప్రతిపక్షాలు మోదీని ఎలా ఓడించాలో నిత్యం వ్యూహాలు రచిస్తుంటాయి. కానీ ఆయన అప్పటికే తదుపరి ఐదేళ్ల ప్రణాళికలతో సిద్ధంగా ఉంటారు.” అని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేసే అభిప్రాయాలకు మోదీ సాధిస్తున్న విజయాలే నిదర్శనం. భారతీయ ఆలోచనా విధానంలో అంతర్భాగమైన ‘నరసేవే నారాయణ సేవ’ అనే సూక్తిని పూర్తిగా విశ్వసించిన ప్రధాని మోదీ అదే బాటలో పయనిస్తూ ప్రజా సేవకే అంకితమయ్యారు.
దేశ రాజకీయాల్లో విలక్షణమైన నేతగా గుర్తింపు పొందిన మోదీ రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన పాలనా దృక్పథంలో కనిపించే అతి ప్రధానమైన అంశం ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేయడమే. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయా స్’తో అభివృద్ధిని అన్ని వర్గాలకు చేర్చాలనే లక్ష్యంగా ఆయన పాలన సాగుతోంది. ఆ ఆలోచన మరింత విస్తరించి ‘వికసిత్ భారత్-2047’ లక్ష్యంగా మారింది.
వ్యవసాయ రంగంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానానికి మెదీ పాలనలో ప్రాధాన్యం పెరిగింది. 2026 జూన్ 20న విడుదల చేసిన పీఎం-కిసాన్ 23వ విడతలో 9.44 కోట్లకుపైగా రైతులకు రూ.18,880 కోట్లకుపైగా నిధులు బదిలీ కాగా, ఇందులో 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు ఉన్నారు. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ.4.46 లక్షల కోట్లకుపైగా పంపిణీ చేశారు.
మౌలిక వసతుల పెంపుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేలు, వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లకు ప్రాధాన్యతిచ్చింది. పీఎం గతిశక్తి కార్యక్రమాల ద్వారా రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాల మధ్య సమన్వయాన్ని పెంచుతున్నారు.
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు మహిళలు, యువత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్ ఇండియా, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్య, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కార్యక్రమాలతో యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే వర్గంగా కాకుండా కొత్త అవకాశాలను సృష్టించే శక్తిగా రూపొందించింది.
జాతీయ భద్రతకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిచ్చి దేశాన్ని బలమైన శక్తిగా రూపొందించడంతో శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించడం లేదు. 2016 ఉరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా అనంతరం బాలాకోట్ వైమానిక దాడులు, 2025 పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి మన దేశ సత్తా ప్రపంచానికి చాటింది.
అంతర్జాతీయంగా భారతదేశ పాత్ర, ప్రతిష్ట నరేంద్ర మోదీ పాలనలో పెరిగాయి. అమెరికా, యూరప్, రష్యా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు జీ-20 అధ్యక్ష బాధ్యతలను, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గ్లోబల్ సౌత్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. మోదీ ప్రభుత్వం ఒకవైపు ప్రపంచ శక్తులతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు భారత వ్యూహాత్మక స్వతంత్రతను కొనసాగించింది.
క్లిష్టమైన మహమ్మారి కరోనా కాలంలో, చమురు సంక్షోభం సమయంలో దేశ ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి పలు దేశాలకు దిక్సుచిగా నిలిచిన మోదీ పాలనను ఒకే కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సంక్షేమం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, తయారీ, యువత, మహిళలు, దేశ భద్రత, సాంస్కృతిక అంశాలు, అంతర్జాతీయ దౌత్యం.. ఇలా అనేక రంగాల్లో విధానపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.

స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి భారత్ ను విశ్వగురువుగా మార్చాలనే లక్ష్యంతో ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, ఆధునిక సాంకేతికత, తయారీ, సామాజిక సంక్షేమం, యువత, మహిళా సాధికరిత వంటి అంశాలకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోంది. మోదీ పాలనలో డిజిటల్ సాంకేతికతను సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడం ముఖ్యమైన మార్పు.
జనధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్ అనుసంధానం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ద్వారా ప్రభుత్వ ప్రయోజనాలను నేరుగా లబ్ధిదారులకు చేరే వ్యవస్థ ఏర్పడింది. 2026 సెప్టెంబర్ 16 నాటికి ప్రధానమంత్రి జనధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 59.31 కోట్ల ఖాతాలు ఉండగా, వాటిలో 33.04 కోట్ల ఖాతాలు మహిళలవి కావడం విశేషం. బ్యాంకింగ్ సదుపాయాలకు దూరంగా ఉన్న కుటుంబాలను ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం, ప్రభుత్వ ప్రయోజనాలను వారికి నేరుగా అందించడం వంటి లక్ష్య సాధనలో ఈ వ్యవస్థ కీలకంగా మారింది.
వ్యవసాయ రంగంలోనూ ప్రత్యక్ష నగదు బదిలీ విధానానికి మెదీ పాలనలో ప్రాధాన్యం పెరిగింది. 2026 జూన్ 20న విడుదల చేసిన పీఎం-కిసాన్ 23వ విడతలో 9.44 కోట్లకుపైగా రైతులకు రూ.18,880 కోట్లకుపైగా నిధులు బదిలీ కాగా, ఇందులో 2.18 కోట్లకు పైగా మహిళా రైతులు ఉన్నారు. 2019లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూ.4.46 లక్షల కోట్లకుపైగా పంపిణీ చేశారు.
ఉజ్వల, స్వచ్ఛ భారత్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ పథకాల ద్వారా ఇల్లు, వంటగ్యాస్, పారిశుద్ధ్యం, తాగునీరు, ఆరోగ్య భద్రత వంటి ప్రాథమిక అవసరాలను సంక్షేమ విధానంలో ప్రధాన అంశాలుగా మోదీ ప్రభుత్వం ముందుకు తెచ్చింది. వీటితో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, గ్రామీణ విద్యుదీకరణ, పక్కా ఇళ్లు, పైప్లైన్ ద్వారా తాగునీటి సరఫరా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగమయ్యాయి.
మౌలిక వసతుల పెంపుతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, రైల్వేలు, వందేభారత్ రైళ్లు, విమానాశ్రయాలు, మెట్రో వ్యవస్థలు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లకు ప్రాధాన్యతిచ్చింది. పీఎం గతిశక్తి కార్యక్రమాల ద్వారా రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక ప్రాంతాల మధ్య సమన్వయాన్ని పెంచుతున్నారు.
దేశంలో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు. అభివృద్ధిని కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా దేశ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ కార్యక్రమాలతో ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీ, రక్షణ ఉత్పత్తులు, సెమీకండక్టర్లు రంగాల్లో దేశీయ తయారీ సామర్థ్యం పెరిగింది.
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు మహిళలు, యువత ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావాల్సిన అవసరాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్టార్టప్ ఇండియా, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ విద్య, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కార్యక్రమాలతో యువతను ఉద్యోగాల కోసం ఎదురు చూసే వర్గంగా కాకుండా కొత్త అవకాశాలను సృష్టించే శక్తిగా రూపొందించింది.
అదే సమయంలో మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచేందుకు స్వయం సహాయక సంఘాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్థిక పరిపుష్టిత అంశాలపై దృష్టి పెట్టి విజయవంతమైంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, యోగా, ఆయుర్వేదం, కళలు, వారసత్వ కట్టడాలు, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని కూడా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో ఒక భాగంగా చూడటం మోదీ విజన్ లో కీలక అంశంగా మారింది.
జాతీయ భద్రతకు మోదీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతిచ్చి దేశాన్ని బలమైన శక్తిగా రూపొందించడంతో శత్రు దేశాలు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించడం లేదు. 2016 ఉరీ దాడుల తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, 2019 పుల్వామా అనంతరం బాలాకోట్ వైమానిక దాడులు, 2025 పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ చేపట్టి మన దేశ సత్తా ప్రపంచానికి చాటింది.
రాజ్యాంగ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లోనూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామమందిరం, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం మోదీ రాజకీయ దృక్పథానికి నిదర్శనం. కరోనా మహమ్మారి మోదీ పాలనకు అత్యంత పెద్ద పరీక్షల్లో ఒకటిగా నిలిచింది. ఉచితంగా ఆహారధాన్యాలు, వ్యాక్సినేషన్ పంపిణీ, ఆక్సిజన్, ఆరోగ్య మౌలిక వసతుల విస్తరణ చర్యలు చేపట్టమే కాకుండా, లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు, చిన్న వ్యాపారాలకు ఇబ్బందులు కలగకుండా ఆర్థిక పునరుద్ధరణ చర్యలు తీసుకొని మోదీ సర్కారు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది.
అంతర్జాతీయంగా భారతదేశ పాత్ర, ప్రతిష్ట నరేంద్ర మోదీ పాలనలో పెరిగాయి. అమెరికా, యూరప్, రష్యా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, ఇండో-పసిఫిక్ ప్రాంతాల దేశాలతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు జీ-20 అధ్యక్ష బాధ్యతలను, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గ్లోబల్ సౌత్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. మోదీ ప్రభుత్వం ఒకవైపు ప్రపంచ శక్తులతో సంబంధాలను బలోపేతం చేస్తూనే మరోవైపు భారత వ్యూహాత్మక స్వతంత్రతను కొనసాగించింది.
క్లిష్టమైన మహమ్మారి కరోనా కాలంలో, చమురు సంక్షోభం సమయంలో దేశ ప్రజలు ఇబ్బందులు పడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించి పలు దేశాలకు దిక్సుచిగా నిలిచిన మోదీ పాలనను ఒకే కోణంలో అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. సంక్షేమం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, తయారీ, యువత, మహిళలు, దేశ భద్రత, సాంస్కృతిక అంశాలు, అంతర్జాతీయ దౌత్యం.. ఇలా అనేక రంగాల్లో విధానపరమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
మోదీ రాజకీయ ప్రయాణాన్ని కేవలం అధికారంలో కొనసాగిన సంవత్సరాల ఆధారంగా కాకుండా, ముఖ్యమంత్రి నుండి ప్రధానమంత్రి హోదా వరకు వచ్చిన విధాన మార్పులు, వాటి అమలు, ప్రజల జీవితాల్లో కనిపించిన ఫలితాల ఆధారంగా చూడాల్సి ఉంటుంది. అధికారం అంతిమ గమ్యం కాదని, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అది ఒక సాధనమని నిరూపించడమే ఏ నాయకత్వానికైనా అసలు సవాలు.
పథకం ప్రకటించడం కంటే అది పేదవాడి చేరడం, పెట్టుబడి రావడం కంటే ఉపాధి కల్పించడం, మౌలిక వసతులు నిర్మించడం కంటే వాటి ఫలాలు సామాన్యుడికి అందడం, అభివృద్ధి గణాంకాల్లో కనిపించడం కంటే ప్రజల జీవన ప్రమాణాల్లో ప్రతిబింబించడం.. ఇవే పాలనా విజయానికి నిజమైన కొలమానాలుగా మోదీ పాలన సాగుతోంది.
భారతంలో భీష్ముడు రాజధర్మం గురించి ప్రస్తావిస్తూ పరివర్తనాత్మక పాలకుడికి సాహసం, కరుణ, సమదృష్టి అనే మూడు లక్షణాల ఉండాలని చెప్పగా, ఇప్పుడు మోదీ వాటిని తన పాలనలో ఆచరించి చూపిస్తున్నారు. ప్రజల జీవితాల్లో శాశ్వతమైన మార్పు తీసుకురావాలన్న సంకల్పమే ఒక నాయకత్వాన్ని చరిత్రలో నిలబెడుతుంది. సీఎం నుండి పీఎం వరకు ప్రజా సేవా సంకల్పంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ‘సబ్ కా సాథ్..వికసిత్ భారత్’ లక్ష్యంగా మహా సంకల్పంతో దేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్థానం నిర్విరామంగా విజయవంతంగా కొనసాగుతోంది.

More Stories
ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం
భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మంధాన
పంజాబ్ సీఎం మాన్ క్యాప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు