కాక్‌పిట్‌లో కత్తితో పొడిచిన దాడి జరిగిన అనంతరం ఫ్లైదుబాయ్ విమానం టెల్ అవీవ్ వైపు దూసుకెళ్లి ఉంటే, 170 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న దానిని కూల్చివేయడానికి ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను సిద్ధం చేసింది. సౌదీ అరేబియాలో ఆ విమానం దిగడానికి ముందు ఫైటర్ జెట్లను ఇజ్రాయెల్ మోహరించినట్లు సీబీఎస్ న్యూస్ వార్తా కథనం ద్వారా వెల్లడైంది.
దుబాయ్ నుంచి ఫ్లైదుబాయ్ విమానం బయలుదేరిన తర్వాత అకస్మాత్తుగా ఆ ప్లేన్ దారి మళ్లింది. ఆ తర్వాత ఆ జెట్ కేవలం 30 సెకన్లలోనే 16,000 అడుగుల ఎత్తును కోల్పోయింది. దీంతో ఈ ఘటన హైజాకింగ్ లేదా దేశంపై దాడికి దారితీయవచ్చనే భయాలు ఇజ్రాయెల్‌లో రేకెత్తాయి. ఇజ్రాయెల్ వైమానిక దళ సిబ్బంది రేడియో ద్వారా కాక్‌పిట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ ఎటువంటి సమాధానం రాలేదు.
ముందుగా ఏర్పాటు చేసిన అత్యవసర వ్యవస్థను ప్రారంభించారు, ఒక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. యుద్ధ విమానాలను రంగంలోకి దించుతుండగా ఇజ్రాయెల్ గగనతలాన్ని మూసివేశారు. ఆ విమానం సౌదీ అరేబియా వైపు మళ్లి, అత్యవసర ల్యాండింగ్ కోసం సిద్ధమవుతోందని అధికారులు నిర్ధారించిన తర్వాత ఆ జెట్ విమానాలను వెనక్కి పిలిపించారు. సీబీఎస్ న్యూస్ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియా కూడా తన యుద్ధ విమానాలను రంగంలోకి దించింది.
ఒకవేళ విమానం తమ వైమానిక క్షేత్రానికి దగ్గరగా వస్తే, జోర్డాన్‌లోని వైమానిక క్షేత్రానికి తమ యుద్ధ విమానాలను పంపి, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేపట్టేవాళ్లమని ఇజ్రాయెల్ పేర్కొన్నది. కాక్‌పిట్‌తో విజువల్ కాంటాక్టు ఏర్పాటు చేసుకోవడానికి వీలైనంత దగ్గర ఐఏఎఫ్ పైలట్లు చేరుకునేవారని, ఆ పరిస్థితిని అంచనా వేసేవాళ్లమని పేర్కొన్నారు.
ఒకవేళ ఆ విమానం టెల్ అవీవ్ వైపు తన మార్గంలోనే ప్రయాణించి ఉంటే, ఇజ్రాయెల్ యుద్ధ విమాన పైలట్లు దూరాన్ని తగ్గించి, కాక్‌పిట్‌లోని వారిని ప్రత్యక్షంగా చూసేందుకు ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ నివేదిక సూచించింది. విమానం హైజాకింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించడం, అలాగే సంక్షోభం యొక్క స్వభావాన్ని స్పష్టం చేసుకోవడమే దీని ఉద్దేశ్యం.
హైజాకింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడం, దానికి తోడు దాడి చేసినవారు మౌనం వహించడం వంటివి జరిగితే, ఈ విషయాన్ని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి, ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉండేదని సీబీఎస్ న్యూస్ పేర్కొంది. కానీ విమానాన్ని షూట్ చేసే తుది నిర్ణయం మాత్రం ప్రధాని చేతుల్లో ఉంటుందని సీబీఎస్ న్యూస్ రిపోర్టులో పేర్కొన్నారు.
బెన్ గురియన్ విమానాశ్రయం, అజ్రేలీ సెంటర్ లేదా హై వాల్యూ టార్గెట్‌ను ఢీకొట్టడం కన్నా విమానాన్ని పేల్చడమే ఉత్తమంగా భావించేవాళ్లమని ఇజ్రాయెల్ వర్గాలు ఆ కథనంలో పేర్కొన్నాయి.

More Stories
ఫ్లైదుబాయ్ హీరో స్మిత్ మచ్చర్ పుర్రెకు పగుళ్లు.. అత్యవసరంగా ఆపరేషన్
న్యూట్రినోలను బంధించిన ఫ్రాన్సిస్ హాల్జన్‌కు ఫిజిక్స్‌లో నోబెల్
హూతీ దాడుల నేపథ్యంలో సౌదీకి పాక్, టర్కీ బలగాలు