* గోల్ఫ్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా ప్రణవి
భారత పురుషుల క్రికెట్ జట్టు మరోసారి స్వర్ణ పతకం సాధించింది. తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్‌లో 19 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (61), తిలక్ వర్మ (51 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో భారత్ 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో పాకిస్థాన్ 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ (96 నాటౌట్) ఒంటరిగా పోరాడినా పాకిస్థాన్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌కు అభిషేక్ శర్మ పాకిస్థాన్ బౌలర్లపై విరుచుకుపడుతూ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. దాంతో పాక్‌పై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో 2025లో దుబాయ్‌లో 24 బంతుల్లో సాధించిన తన రికార్డును తానే అధిగమించాడు. అభిషేక్ 28 బంతుల్లో 61 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు,
ఆ తర్వాత తిలక్ వర్మ తనదైన శైలిలో చెలరేగిపోయి ఆడాడు. కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం సాధించాడు. శివమ్ దూబేతో కలిసి ఆరో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. దాంతో భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 212 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన పాక్‌కు హసన్ నవాజ్ అండగా నిలిచాడు.
భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ 51 బంతుల్లోనే 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. సైమ్ అయూబ్ (29) మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసి పాక్ పరుగుల వేగానికి అడ్డుకట్ట వేశారు. చివర్లో శివమ్ దూబే కూడా రెండు వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో లక్ష్యానికి 19 పరుగుల దూరంలో ఆగిపోయింది.
కాగా ఈ క్రీడల్లో ఇప్పటికే మహిళా క్రికెట్ జట్టుకు స్వర్ణం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గోల్ఫ్, ఆర్చరీల్లో ఒక్కో పసిడి పతకాలు వచ్చాయి. కాగా ఈ ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య 19కు చేరింది.
భారత గోల్ఫర్ ప్రణవి శరత్ ఉర్స్ మహిళల వ్యక్తిగత గోల్ఫ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన చివరి రౌండ్‌లో ఒత్తిడిని అధిగమించిన ప్రణవి 18వ హోల్‌లో కీలకమైన పార్ పుట్‌ను విజయవంతంగా పూర్తి చేసి ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా ప్రణవి చరిత్ర సృష్టించింది. 2002లో శివ్ కపూర్ తర్వాత ఆసియా క్రీడల్లో గోల్ఫ్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.

More Stories
అమెరికాలోని ఓహియోలో హిందూ ఆలయంపై ఇటుకలతో దాడి
చైనాను ఓడించి 44 ఏళ్ల తర్వాత హాకీలో బంగారు పతకం
ఫ్లైదుబాయ్ పైలట్, ప్రయాణికులను కాపాడటంలో కీలకంగా చిన్నారి!