113 కేజీల గోల్డ్ స్మగ్లింగ్ లో నటి రన్యా రావుకు రూ. 58 కోట్ల జరిమానా

దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారం అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ చిత్రసీమ నటి, మోడల్ రన్యా రావుకు అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ కేసులో ఆమెకు కస్టమ్స్ శాఖ రూ.89 కోట్ల జరిమానా విధించింది. దీంతో కస్టమ్స్ చట్టం-1962 ప్రకారం ఈ జరిమానాను రన్యా రావు చెల్లించాల్సి ఉంటుంది.

ఆ కేసును దర్యాప్తు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు, 2024 మార్చి 7 నుంచి 2025 ఫిబ్రవరి 18 మధ్య కాలంలో రన్యా రావుతో పాటు కేసులో నిందితులుగా ఉన్న మరికొందరు దుబాయ్ నుంచి బంగారం అక్రమ రవాణాలో పాల్గొన్నట్లు గుర్తించారు. దర్యాప్తులో వెలువడిన వివరాల ప్రకారం, నిందితులు దాదాపు ఏడాది కాలంలో 113 కిలోల బంగారాన్ని రవాణా చేయడంలో పాలుపంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. 

ఈ కేసులో రన్యా రావుతో పాటు తరుణ్ కొండరాజు, సాహిల్ జైన్, భరత్ జైన్‌లను కూడా అరెస్టు చేశారు. రన్యా రావుకు రూ.89 కోట్ల జరిమానా విధించడంతో పాటు కేసులోని ఇతర నిందితులలైన సాహిల్ జైన్, భరత్ జైన్‌లకు చెరో రూ.53 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తరుణ్ కొండరాజుకు రూ.49 కోట్ల జరిమానా విధించింది. ఆ మొత్తాలను కస్టమ్స్ చట్టం ప్రకారం నిర్దేశించిన విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

నిర్దేశించిన విధానంలో జరిమానా చెల్లించడంలో నిందితులు విఫలమైతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వర్తించే నిబంధనల ప్రకారం జరిమానా మొత్తాన్ని వసూలు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టవచ్చు. అవసరమైతే నిందితుల ఆస్తులను జప్తు చేయడం సహా తదుపరి వసూలు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు కస్టమ్స్ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో నటి రన్యా రావుపై 127 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఆమె హ్యాండ్లర్లు, ఆభరణాల వ్యాపారులు కలిసి ఆ బంగారాన్ని దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఛార్జ్‌షీట్‌లో రన్యా రావుతో పాటు ఆమె సహాయకుడిగా ఉన్న తరుణ్ కొండూరు, బళ్లారికి చెందిన గోల్డ్ డీలర్ సాహిల్ జైన్ పేర్లను ఈడీ చేర్చింది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన వ్యవహారంలో వీరి పాత్రపై దర్యాప్తు చేసిన అధికారులు వివరాలను ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు.

 

About The Author