సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపు బాధితుల ‘విస్పర్ నెట్‌వర్క్’

* 100 మందికి పైగా ప్రముఖ పురుషుల పేర్లతో కూడిన రహస్య స్ప్రెడ్‌షీట్ వైరల్ 
ప్రపంచ సాంకేతికత, స్టార్టప్‌లకు కేంద్రంగా ఉన్న అమెరికా సిలికాన్ వ్యాలీలోని సంస్థల్లో లైంగిక వేధింపుల ఆరోపణలు మరోసారి సంచలనమమవుతున్నాయి. ఇక్కడి టెక్ దిగ్గజాలు, పెట్టుబడిదారుల చేతిలో ఎదుర్కొంటున్న చేదు అనుభవాలపై మహిళలు గొంతు విప్పుతున్నారు. ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్న 100 మందికి పైగా పురుషుల పేర్లతో కూడిన ఒక రహస్య స్ప్రెడ్‌షీట్ తాజాగా వైరల్ అవుతోంది. 
 
సిలికాన్ వ్యాలీలోని మహిళలు తమ రక్షణ కోసం అనధికారికంగా ‘విస్పర్ నెట్‌వర్క్’ ఏర్పాటు చేసుకుంది. ఇందులోని విషయాలను మహిళలు పరస్పరం పంచుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘ది న్యూయార్క్ పోస్ట్’ తనకు సమాచారం అందించిన వ్యక్తులను ఉటంకిస్తూ తెలిపింది.ఈ జాబితాలో పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌లు, ప్రముఖ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు ఉన్నట్టు సమాచారం. 
 
ఇందులో నమోదైన ఆరోపణలు అవాంఛిత లైంగిక ముందడుగుల నుంచి మత్తు పదార్ధాలు ఇవ్వడం, లైంగిక దాడి, అత్యాచారం వరకూ ఉన్నాయి. అయితే ఈ స్ప్రెడ్ షీట్ ప్రజలకు అందుబాటులో లేదు. ఇందులోని విషయాలను స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.  ఈ నెట్‌వర్క్ గురించి తెలిసిన పలువురు మహిళలు మహిళలు వృత్తిపరమైన ప్రతీకార చర్యల భయంతో ఇలాంటి సమాచారాన్ని రహస్యంగా పంచుకుంటున్నామని తెలిపారు. 
 
స్టార్టప్‌ల వ్యవస్థ పరస్పరం బలంగా అనుసంధానమై ఉండటం, ప్రతిభావంతమైన పెట్టుబడిదారులు, ఎగ్జిక్యూటివ్‌లపై వచ్చే ఆరోపణల కెరీర్‌ల, నిధుల అవకాశాలు, వృత్తిపరమైన సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. ఈ జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు చూసి తాను ఆశ్చర్యపోయినట్టు 20 ఏళ్ల టెక్నాలజీ ఉద్యోగిని ఒకరు చెప్పారు. 
 
ఈ నెట్‌వర్క్ గురించి తెలుసుకున్న తర్వాత తాను సైతం ఎదుర్కొన్న లైంగిక దుష్ప్రవర్తన ఘటనను అందులో నమోదు చేసినట్లు వెల్లడించింది. ‘వారిలో కొందరు చాలా ప్రముఖులు, ప్రసిద్ధ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. నేను వారిని పార్టీలోకూడా చూసేదాన్ని’ అని తెలిపింది. విస్పర్ నెట్‌వర్క్‌ను నిర్వహించే కొందరు మహిళలను తాను కలిసానని, అందులో వందలాది కేసులున్నాయని చెప్పారు. 
 
తన కేసు వ్యవహారంలో న్యాయం కోసం ప్రయత్నించి విఫలమైతే పట్టణంలోని ప్రతి పెట్టుబడిదారుడు తనను బ్లాక్‌లిస్ట్ చేస్తారమోనని భయపడినట్టు మరో మహిళ తెలిపింది.  లైంగిక దాడి, డ్రగ్స్ ఇవ్వడం, అత్యాచారం వంటి ఘటనలు ఎక్కువగా ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు కలిసి ఉండే నివాస ప్రాంగణాలు, టెక్ పార్టీల్లో జరుగుతున్నట్టు తాజా కథనం వెల్లడించింది. 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కొన్ని సంఘటనలు “హ్యాకర్ హౌసెస్” అని పిలవబడే ప్రదేశాలలో జరిగాయి. ఇవి యువ వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, టెక్నాలజీ ఉద్యోగులు కలిసి నివసిస్తూ, వ్యాపారాలు, వృత్తిపరమైన సంబంధాలను అభివృద్ధి చేసుకునే సామూహిక నివాసాలు. వ్యక్తిగత, వృత్తిపరమైన సంబంధాల మధ్య ఉండే ఈ కలయిక ఆరోపణలను మరింత క్లిష్టతరం చేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
ఎందుకంటే, కలిసి మెలిసి ఉండే వ్యక్తులు వ్యాపార భాగస్వాములుగా, పెట్టుబడిదారులుగా, సహోద్యోగులుగా లేదా కాబోయే యజమానులుగా కూడా మారవచ్చు. కొంతమంది పురుషులు వ్యక్తిగత హద్దులు దాటడానికి ముందు నమ్మకాన్ని ఏర్పరచుకోవడానికి స్నేహాలను ఉపయోగించుకున్నారని ఒక అంతర్గత వ్యక్తి ఆరోపించారు. యువతులు, ఇటీవల అమెరికా లేదా సిలికాన్ వ్యాలీకి వలస వచ్చిన వారు ముఖ్యంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని కూడా ఆ విశ్వసనీయ వర్గం పేర్కొంది.
జెట్టే యాప్ వ్యవస్థాపకురాలైన యెహాంగ్ జు, శాన్ ఫ్రాన్సిస్కో హ్యాకర్ హౌస్ జెనెసిస్‌కు చెందిన ఒక మాజీ సభ్యుడిపై అత్యాచారం, దాడి ఆరోపణలు చేసిన తర్వాత తన అనుభవాన్ని బహిరంగంగా పంచుకున్నారు. ఆరోపిత దాడి జరిగిన తర్వాత, ఒక మహిళా స్నేహితురాలు ఈ ఆరోపణ ఆ వ్యక్తి ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఆందోళన వ్యక్తం చేసిందని ఆమె చెప్పారు. 
 
వెంటనే పోలీసులను ఆశ్రయించవద్దని హౌస్ ఆర్గనైజర్ ఒకరు తనను నిరుత్సాహపరిచారని, ఆ వ్యక్తిని తొలగించాలా వద్దా అనే దానిపై ఒక కమిటీని ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహించాలని సూచించారని జు తెలిపారు. చివరికి జు, ఆ వ్యక్తి ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో భాగంగా పోలీసులను, న్యాయవాదులను సంప్రదించారు. ఆ వ్యక్తిని తెలిసిన వారిని కూడా కలిశారు. అతనితో పెట్టుబడులు పెట్టడం లేదా వ్యాపారం చేయడం వల్ల కొందరు ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించారని ఆమె చెప్పారు.
కాగా, లైంగిక దాడికి గురైన బాధితులను ఒక దగ్గరకు చేర్చేందుకు ఏర్పాటయిన కాలిస్టో సంస్థ గత జూలైలో మూతపడింది. నేరస్థుల సమాచరాన్ని షేర్ చేసుకోవడానికి బాధితులకు ఒక మార్గం కావాలని, మహిళలు తమను తాము రక్షించుకునే మార్గాలను అన్వేషిస్తున్నారని కాలిస్టో సీఈఓ తెలిపారు. అలాగే దురుసుగా ప్రవర్తించే వ్యక్తులను తొలగించే విషయంలోనూ కంపెనీల విధానాలు మారాలన్నారు. 
 
అయితే టెక్ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వాలే ఎక్కడా కూడా అది జరగడం లేదని ఆయన వాపోయారు. నిధులు ఎవ్వరూ ఇవ్వకపోవడంతో జూలై నుంచి కొత్తవారికి తమ సంస్థ సాయం అందిచంలేకపోతోందని చెప్పారు. టెక్నాలజీ రంగంలోని అత్యంత సన్నిహితంగా అనుసంధానమైన సమాజాల్లో ఫిర్యాదులు, భద్రతకు సంబంధించిన ఆందోళనలపై తాజా వివరాలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.  అయితే ఇక్కడ వృత్తిపరమైన, సామాజిక, నివాస సంబంధాలు ఒకదానితో మరొకటి ముడిపడి ఉండటం వల్ల ఇటువంటి ఆరోపణలను ఎదుర్కోవడం మరింత సంక్లిష్టంగా మారుతోందని చెబుతున్నారు.  

About The Author