* 10 బంగారు పతకాలతో సహా 59 పతకాలతో ఆసియా క్రీడల్లో 7 స్థానాల్లో భారత్
జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు-2026లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికితారావు అద్భుత ప్రదర్శనతో 2 స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఒకేరోజు మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లలో గోల్డ్ మెడల్స్ సాధించిన చికితపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పైగా, ఒకేరోజు నాలుగు బంగారు పతకాలతో భారత్ బుధవారం నాటికి మొత్తం 10 బంగారు పతకాలు సాధించినట్లయింది.
భారత్‌కు ఏడవ స్వర్ణ పతకం మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ద్వారా లభించింది. వారు ఈ విభాగం ఫైనల్ పోరులో చైనాను ఓడించి విజయం సాధించారు. అలాగే, మిక్స్‌డ్ ఆర్చరీ జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. వారు దక్షిణ కొరియాను ఓడించి భారత్‌కు ఎనిమిదవ స్వర్ణ పతకాన్ని అందించారు.
అంతేకాకుండా, మిక్స్‌డ్ ట్రాప్ షూటింగ్ జట్టులో నీరు ధండా, కైనన్ చెనై జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, 2026 ఆసియా క్రీడలలో భారత్‌కు తొమ్మిదవ స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టారు. పురుషుల కాంపౌండ్ ఆర్చరీ జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో చైనాను ఓడించి, ఈ క్రీడల్లో భారత బృందానికి 10వ స్వర్ణ పతకాన్ని అందించింది.
ముఖ్యంగా, కాంపౌండ్ ఆర్చరీలో సాధించిన విజయంతో, ఆసియా క్రీడలు 2026లో భారత్ తన 59వ పతకాన్ని కైవసం చేసుకుంది. 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో, కజకిస్తాన్, ఉత్తర కొరియా, మలేషియా వంటి అనేక దేశాలను అధిగమించి భారత్ పతకాల పట్టికలో 7వ స్థానానికి చేరుకుంది.
చికితారావు ఘనతపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన చికితారావు ఆసియా క్రీడల్లో కనబరిచిన ప్రతిభను కొనియాడారు. నిరంతర సాధన, పట్టుదల, దృఢసంకల్పంతో ఆమె సాధించిన విజయం తెలంగాణ క్రీడారంగానికి గర్వకారణమని పేర్కొన్నారు. చికిత ప్రతిభను గుర్తించి చిన్ననాటి నుంచి ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులు, కోచ్‌లను కూడా సీఎం రేవంత్ అభినందించారు.
ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన చికితారావుకు మరో కీలక అవకాశం దక్కింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సాధించినట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో ఆసియా క్రీడల్లో సాధించిన రెండు స్వర్ణాలకే కాకుండా, అంతర్జాతీయ వేదికపై భారత తరఫున మరింత పెద్ద లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్న క్రీడాకారిణిగా చికిత నిలిచారు.
ఆసియా క్రీడల్లో మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో చికితారావు, జ్యోతి సురేఖ, ప్రీతికా ప్రదీప్ కలిసి భారత జట్టుకు స్వర్ణ పతకం అందించింది. ఫైనల్లో భారత త్రయం చైనా జట్టును 238-234 స్కోరుతో ఓడించింది. ఈ విజయంతో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు తమ సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లో భారత్ నమోదు చేసిన 238 పాయింట్లు కూడా ప్రత్యేకంగా నిలిచాయి.
2014 ఆసియా క్రీడల్లో దక్షిణ కొరియా నెలకొల్పిన 238 పాయింట్ల రికార్డును భారత జట్టు సమం చేసింది. దీంతో మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత ఆర్చర్ల ప్రదర్శన మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. మహిళల టీమ్ ఈవెంట్ తర్వాత జరిగిన మిక్స్‌డ్ కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్లోనూ చికితారావు మరోసారి తన సత్తా చాటారు.
మహారాష్ట్రకు చెందిన సాహిల్ రాజేశ్ జాదవ్‌తో కలిసి భారత జట్టు తరఫున బరిలోకి దిగిన చికిత దక్షిణ కొరియా జోడీతో తలపడింది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో ఇరు జట్ల స్కోర్లు సమంగా నిలవడంతో షూట్‌ఆఫ్ నిర్వహించారు. కీలకమైన షూట్‌ఆఫ్‌లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించి 158-157 తేడాతో విజయం సాధించింది. దీంతో చికితారావు ఖాతాలో ఒకేరోజు రెండో స్వర్ణ పతకం చేరింది.
చికితారావు డబుల్ గోల్డ్ సాధించడంతో పాటు భారత ఆర్చర్లు ఆసియా క్రీడల్లో ఒకేరోజు మూడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ తర్వాత పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ పసిడి పతకం సాధించింది. పురుషుల ఫైనల్లో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరు సభ్యులుగా ఉన్న భారత జట్టు చైనాపై 238-237 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత ఆర్చరీ బృందం ఒకేరోజు 3 స్వర్ణాలతో అద్భుత ప్రదర్శన నమోదు చేసింది.
చికితారావు డబుల్ గోల్డ్ సాధించడంతో పాటు భారత ఆర్చర్లు ఆసియా క్రీడల్లో ఒకేరోజు మూడు స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. మహిళల కాంపౌండ్ టీమ్, మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ తర్వాత పురుషుల కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ పసిడి పతకం సాధించింది. పురుషుల ఫైనల్లో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేశ్ మణిరత్నం తిరుమూరు సభ్యులుగా ఉన్న భారత జట్టు చైనాపై 238-237 తేడాతో విజయం సాధించింది. దీంతో భారత ఆర్చరీ బృందం ఒకేరోజు 3 స్వర్ణాలతో అద్భుత ప్రదర్శన నమోదు చేసింది.

More Stories
ఇండియా కూటమి భేటీకి దూరంగా ఆప్, డీఎంకే, ఊగిసలాటలో అఖిలేష్
అథ్లెటిక్స్‌లో మహిళల రిలే జట్టు పసిడి పరుగు
నవంబర్‌లో బంగ్లా ప్రధాని తారిక్ రెహమాన్ భారత్ లో పర్యటన?