భారత మోటార్‌స్పోర్ట్స్ వేదికపై విశాఖపట్నానికి చెందిన యువ రేసర్ బోను భువన్ సంచలనం సృష్టించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరుగుతున్న ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్–2026లో భాగమైన ఇండియన్ ఎఫ్ 4 ఛాంపియన్‌షిప్‌లో రౌండ్–2 రేస్–2లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశారు.
హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన భువన్ రౌండ్–2లో అద్భుతమైన వేగం, నియంత్రణతో పోటీదారులను అధిగమించి విజేతగా నిలిచారు. ఈ సీజన్లో ఇండియన్ రేసర్ సాధించిన తొలి విజయంగా ఇది నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. రౌండ్–2 పూర్తయ్యే సమయానికి ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భువన్ మూడో స్థానంలో నిలిచారు.
ఇప్పటివరకు స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ రేసింగ్ సర్క్యూట్లో తన ప్రతిభను చాటుతున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న పోటీల్లో యువ రేసర్‌గా భువన్ చూపుతున్న ప్రదర్శనపై మోటార్‌స్పోర్ట్స్ వర్గాలు ఆసక్తి కనబరుస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి తొలి రేసర్ ఇండియన్ ఎఫ్ 4 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తొలి రేసర్‌గా తెలుగు రాష్ట్రాల నుంచి బోను భువన్ గుర్తింపు పొందారు. విశాఖపట్నం నుంచి మోటార్‌స్పోర్ట్స్‌లో ప్రయాణం ప్రారంభించిన ఆయన.. జాతీయ స్థాయి వేదికపై సాధించిన ఈ విజయంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల రేసింగ్ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

More Stories
తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ!
కృష్ణలంక పోలీసు హింసతోనే సాయికృష్ణ మృతి
తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్ట్