భారత్‌లో అనేక విధ్వంసకర దాడులకు పాల్పడిన నిషేధిత ఉగ్రవాద సంస్థ ‘జైషే మహమ్మద్’ (జెఈఎం) వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ ఆచూకీపై తీవ్ర అనిశ్చితి కొనసాగుతోంది. అతడు పాకిస్తాన్‌లోనే తలదాచుకున్నాడని భారత్ సహా అనేక దేశాలు ఆరోపిస్తుంటే మసూద్ అజార్ ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయాడని పాకిస్తాన్ కొన్నేళ్లుగా ఆరోపిస్తోంది. ఆఫ్గన్ ప్రభుత్వం ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.
భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడులలో మసూద్ అజార్ పాత్ర ప్రత్యక్షంగా ఉంది: భారత పార్లమెంట్‌పై దాడిముంబై ఉగ్రదాడులు (26/11) పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న పుల్వామా దాడులు. ఈ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2019 మే నెలలో మసూద్ అజార్‌ను ‘గ్లోబల్ టెర్రరిస్ట్’గా ప్రకటించింది.
అలాంటి మసూద్ అజార్‌కు ఆశ్రయమిచ్చినందుకు పాకిస్తాన్‌ను ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఏ) నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే, యూరప్ సహా అనేక దేశాలు అందించే ఆర్థిక సహాయాన్ని తీవ్రవాదులకు వినియోగిస్తే.. ఎఫ్ఏటీఏ ఆయా దేశాలను నిషేధిత జాబితాలో చేరుస్తుంది. అలా, పాకిస్తాన్‌ను ఈ జాబితాలో చేర్చారు. ఇలా చేయకూడదనుకుంటే మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయాలి.
కానీ, 2019 నుంచి అతడు తమ దేశం వదిలి ఆఫ్గన్ వెళ్లిపోయాడని పాక్ చెబుతోంది. 2022లో తాలిబన్లు ఆఫ్గన్‌లో అధికారం చేపట్టిన తర్వాత కూడా మసూద్ అజార్ తమ దేశంలో లేడని వెల్లడించారు. మసూద్ అజార్‌ను అరెస్ట్ చేయమని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేయగా, అతడు 2019లోనే తమ దేశం వదిలి ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయాడని పాకిస్తాన్ సాకులు చెప్పడం ప్రారంభించింది.
పాకిస్తాన్ ఆరోపణలపై ఆఫ్గనిస్తాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, మసూద్ అజార్ తమ భూభాగంలో లేడని స్పష్టం చేసింది. తమ భూభాగం నుంచి ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని తేల్చిచెప్పింది. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత కూడా మసూద్ అజార్ తమ దేశంలో లేడని పునరుద్ఘాటించారు.
రెండు దేశాలు అతడు తమ వద్ద లేడని ప్రకటనలు చేస్తున్నప్పటికీ, అంతర్జాతీయ నిఘా వర్గాల అంచనాల ప్రకారం మసూద్ అజార్ పాకిస్తాన్‌లోని బహావల్‌పూర్‌లో లేదా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో పాక్ ఆర్మీ, ఐఎస్ఐ రక్షణలోనే సురక్షితంగా ఉన్నాడని భావిస్తున్నారు.

More Stories
ఇరాన్ చేతికి అమెరికా అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి ‘డైవ్ ఎల్డీ’?
దుర్గాపూజ సమీపిస్తుండగా బంగ్లాదేశ్‌లో ముగ్గురు హిందువుల హత్య
బంగ్లాదేశ్ సైనిక విన్యాసాల్లో పేలిన చైనా తయారీ ట్యాంక్