భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ఖాతాలో మరో టైటిల్ చేరింది. చైనా మాస్టర్స్ సెమీస్‌లో సంచలన విజయంతో ఫైనల్ చేరిన ఈ జోడీ ఆఖరి పోరులో చైనా జంటను చిత్తు చేసింది. ఆదివారం జరిగిన ఫైనల్లో హే జీ టింగ్ – రెన్ గ్జియాంగ్‌పై అద్భుతం విజయంతో విజేతగా నిలిచింది సాత్విక్ – చిరాగ్ జంట. తొలి సెట్ కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకని భారత జోడీ వరసగా రెండు సెట్లలో గెలుపొందింది. దాంతో చైనా షట్లర్లకు నిరాశే మిగిలింది.
చైనా మాస్టర్స్‌లో సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి ద్వయం ఛాంపియన్‌గా నిలిచింది. పురుషుల డబుల్స్‌లో అంచనాలు అందుకుంటూ ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జంట ధాటికి చైనా షట్లర్లు చేతులెత్తేశారు. తొలి సెట్‌ను 11-21తో కోల్పోయిన సాత్విక్ జోడీ ఒత్తిడికి లోనవ్వలేదు. రెండో సెట్‌లో గొప్పగా ఆడి హే జీ టింగ్ – రెన్ గ్జియాంగ్‌కు 21-13తో షాకిచ్చింది. నిర్ణయాత్మక మూడో సెట్‌లోనూ భారత ద్వయం చెలరేగింది.
ఫలితంగా 21-17తో సెట్‌ను గెలుపొందడంతో పాటు టైటిల్‌నూ సొంతం చేసుకుందీ స్టార్ జోడీ. గతంలో రెండుసార్లు(2023, 2025) ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ చిరాగ్ ఈసారి తమ కలను సాకారం చేసుకుంటూ విజేతగా నిలిచారు. మొత్తంగా ఈసీజన్‌లో వీరికి ఇది రెండో టైటిల్. ఈమధ్యే ఈ జంట సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టైటిల్‌ను గెలిచింది.
సెప్టెంబర్ 19 నుండి జపాన్‌లో జరగనున్న ఆసియా క్రీడలలో తమ స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకునేందుకు సిద్ధమవుతున్న ప్రపంచ 5వ ర్యాంక్ జోడీకి ఈ టైటిల్ విజయం గొప్ప ఊతాన్నిస్తుంది. ఈ భారతీయ జోడీ చైనాకు చెందిన ఒక జంటతో తలపడింది. సుదీర్ఘకాలం పాటు పోటీలకు దూరంగా ఉండటం వల్ల ఆ చైనీస్ జోడీ ర్యాంకింగ్ ప్రపంచంలో 70వ స్థానానికి పడిపోయింది.

More Stories
`భిన్నత్వం సహజం..ఐక్యతే సత్యం’ చాటి చెప్పడమే హిందూ రాష్ట్ర లక్ష్యం
ఇరాన్ నౌకలపై అమెరికా దాడులు..బాలిస్టిక్ క్షిపణులతో టెహ్రాన్ ప్రతీకారం
టీ20 ఆసియాక్‌పలో 7 వికెట్లతో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన భారత్