`నీట్’ ఆందోళనకారులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు.. `సుప్రీం’కు కేంద్రం వినతి

`నీట్’ ఆందోళనకారులపై ఎఫ్‌ఐఆర్‌లు రద్దు.. `సుప్రీం’కు కేంద్రం వినతి

నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో దాడికి పాల్పడ్డ నిందితులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టిక్ 142ను ఉపయోగించాలని కోరింది. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా గత జూలైలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే. 

ఈ నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులపై భద్రతాదళాలు దాడి చేయగా, పోలీసులు, భద్రతా బలగాలపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆస్తి నష్టం జరిగింది. దీంతో ఈ దాడులకు పాల్పడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీతోపాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో కూడా అనేక మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 

అయితే, సీజేపీ ఆందోళన విరమించే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళనకారుల విషయంలో ఒక హామీ ఇచ్చింది. ఈ దాడి సందర్భంగా యువతపై నమోదైన కేసుల్ని తొలగిస్తామని, ఎఫ్‌ఐఆర్‌లో రద్దు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది జరిగి నెల రోజులు అవుతున్నా.. ఇంకా ఎఫ్‌ఐఆర్‌లు రద్దు కాలేదు. 

దీంతో ఇచ్చిన హామీని ప్ర  నిలబెట్టుకోని కారణంగా సెప్టెంబర్ 5న సీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీలో మరో ర్యాలీ జరగనుంది. ఈ నేపథ్యంలో ముందుగానే స్పందించిన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనకున్న అపరిమిత అధికారాన్ని ఉపయోగించి, నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. 

ఇందుకోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాల్ని వాడాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ ముందు ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. మంగళవారమే ఈ కేసు విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. 

దీనిపై స్పందించిన జస్టిస్ సూర్యకాంత్ ఈ కేసు విచారణ అంత త్వరగా చేపట్టడం అత్యవసరమా? అని ప్రశ్నించారు. దీనికి మెహతా బదులిస్తూ ఈ విషయంలో ఇరుపక్షాలు రాజీ కుదుర్చుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం, ఆందోళనకారులు కలిసి ఈ అంశంపై ఏకాభిప్రాయానికి వస్తామంటే తమకేం అభ్యంతరం లేదని కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణను సెప్టెంబర్ 1, మంగళవారానికి వాయిదా వేసింది.