* డోక్లాం, గాల్వాన్లలో దళాలను నడిపించిన పీఎల్ఏ కమాండర్‌పై వేటు
2020లో భారత్‌తో జరిగిన గాల్వాన్ ఘర్షణలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ)కి నాయకత్వం వహించిన చైనా మాజీ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ చీఫ్ జనరల్ జావో జోంగ్కీ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం అతడు ప్రభుత్వ సలహాదారుగా కూడా కొనసాగుతున్నాడు అదే సమయంలో, మరో ఇద్దరు సీనియర్ సైనిక కమాండర్లను దేశ అత్యున్నత సైనిక కమాండ్ సంస్థ నుండి తొలగించారు.
చైనా అత్యున్నత రాజకీయ సలహా మండలి అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) జాతీయ కమిటీ స్టాండింగ్ కమిటీ, జనరల్ జావో సభ్యత్వాన్ని రద్దు చేసింది. సీపీపీసీసీ జాతీయ కమిటీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, జాతి, మత వ్యవహారాల కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న పదవుల నుండి జావోను తొలగించి, సీపీపీసీసీ సభ్యత్వాన్ని రద్దు చేసే నిర్ణయాన్ని సీపీపీసీసీ సమావేశం ఆమోదించినట్లు చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని జిన్హువా వార్తా సంస్థను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
జనరల్ జావో 2016 నుండి 2020 వరకు పీఎల్ఏ వెస్ట్రన్ థియేటర్ కమాండ్‌కు నాయకత్వం వహించారు. 2016లో పీఎల్ఏ సంస్కరణల అనంతరం ఈ థియేటర్‌ను ఏర్పాటు చేసినప్పుడు, వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసి) వెంబడి ఉన్న వివాదాస్పద భారత్-చైనా సరిహద్దు మొత్తాన్ని పర్యవేక్షిస్తూ, ఆయన దాని మొదటి కమాండర్‌గా నియమితులయ్యారు.
ఆగ్నేయ సిక్కింలో 2017 డోక్లాం ప్రతిష్టంభన, తూర్పు లడఖ్‌లో 2020 చైనా-భారత్ సరిహద్దు ఘర్షణలు వంటి ప్రధాన భౌగోళిక రాజకీయ ఉద్రిక్త ప్రాంతాల సమయంలో జావో కీలకమైన కమాండ్‌ను నిర్వహించారు. ఈ ఘర్షణలలో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందగా, ఎంతమంది పీఎల్ఏ సిబ్బంది మరణించారో స్పష్టంగా తెలియదు.
సాధారణ పదవీ విరమణ వయస్సును చేరుకున్న తర్వాత, 2020 చివరలో ఆయన అధికారికంగా కమాండ్‌ను జనరల్ జాంగ్ జుడాంగ్కు అప్పగించారు. అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల కమిషన్ నుంచి జాంగ్ యూషియా, లియు జెన్లీలను తొలగించారు.
అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సైనిక కమిషన్ నుండే కాకుండా, చైనా పార్లమెంటు అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్ ప్రచురించిన నవీకరించిన డిప్యూటీల జాబితా నుండి కూడా జాంగ్, లియుల పేర్లను తొలగించారు. తొలగించిన వారిలో సిఎంసి జనరల్ ఆఫీస్ మాజీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ ఝోంగ్ షావోజున్, సైనిక వ్యూహాత్మక సహాయక దళం మాజీ కమాండర్ జనరల్ జు కియాన్షెంగ్ ఉన్నారు.

More Stories
`భిన్నత్వంలో ఏకత్వం’ రాజకీయ నినాదం కాదు.. భారతీయ డిఎన్ఏ!
ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడిలో 37 మంది మృతి
భగవత్ ప్రసంగంకు అనూహ్య స్పందన… రిజిస్ట్రేషన్లు నిలిపివేత