మహబూబ్‌నగర్ లో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా స్థానిక పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డి.కె. అరుణతో పాటు పలువురు ముఖ్య నేతలతో కలిసి పాల్గొన్నారు. వాజ్‌పేయి హయాం నుండి నేటి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన వరకు బీజేపీ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడుతూ, ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్, సబ్‌కా ప్రయాస్’ అనే నినాదంతో ముందుకు సాగుతోందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్రా, జన్ ధన్, ఉజ్వల, ఉడాన్ వంటి ప్రతి సంక్షేమ పథకంలో 22 శాతం నుండి 37 శాతం వరకు లబ్ధిదారులు మైనారిటీ వర్గాల వారే ఉండటం మోదీ ప్రభుత్వ సమన్యాయ పాలనకు నిదర్శనమని తెలిపారు. ఏటా మైనారిటీ విద్యార్థులకు భారీగా స్కాలర్‌షిప్‌లు అందించడంతో పాటు, ముస్లిం యువత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఉచిత కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు.
నిజాం నిరంకుశ పాలనపై హైదరాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ వంటి దేశభక్తులు సైతం ‘వందేమాతరం’ నినదిస్తూ ప్రాణాలర్పించారని గుర్తుచేశారు. వందేమాతరం ఏ మతానికీ వ్యతిరేకం కాదని, అది పవిత్రమైన భరతమాతను గౌరవించే జాతీయ గేయమని పేర్కొన్నారు. 1937లో ముస్లిం లీగ్‌కు భయపడి మొదటి రెండు చరణాలకే పరిమితం చేసిన కాంగ్రెస్, నేడు కేరళలో జమాతే ఇస్లామీ, తెలంగాణలో మజ్లిస్ పార్టీల ఓటు బ్యాంకుకు భయపడి వందేమాతరాన్ని వ్యతిరేకిస్తూ దేశభక్తిని అవమానిస్తోందని ధ్వజమెత్తారు.
మోదీ ప్రభుత్వంలో మాత్రమే మైనారిటీలకు నిజమైన రక్షణ, విద్య, ఉద్యోగ, సంక్షేమ రంగాల్లో సమాన అవకాశాలు అందుతున్నాయని పేర్కొంటూ ఈ వాస్తవాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని మైనారిటీ మోర్చా శ్రేణులకు రాoచందర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని తీవ్రంగా విమర్శించారు.

More Stories
మైనర్‌పై అఘాయిత్యం ఆరోపణలపై ఎమ్యెల్సీ బేగ్ పై ఎంఐఎం వేటు
తుమ్మిడిహెట్టి ఆనకట్టపై 1న కేంద్ర జల సంఘం భేటీ
ఎస్ఐఆర్ ప్రక్రియలో నకిలీ వివరాలు ఇస్తే జైలు శిక్ష