కాగా, మెటా బాధ్యతను నిర్ధారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు ఇతర సభ్యులు డిమాండ్ చేశారు. `సామాజిక, డిజిటల్ వేదికలు- వాటి నియంత్రణ’ అనే అంశంపై చర్చించేందుకు బీజేపీ సభ్యుడు దుబే నేతృత్వంలోని కమిటీ ఈ సమావేశం నిర్వహించింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్, స్నాప్‌చాట్, గూగుల్, ఎక్స్, మెటా (ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్), యూట్యూబ్ వంటి సామాజిక, డిజిటల్ మీడియా వేదికల ప్రతినిధులు కమిటీ ముందు హాజరయ్యారు.
“ప్రధాని వీడియోను ఎందుకు తొలగించారు? ఇందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అభ్యంతరకరమైన ఇతర కంటెంట్‌ను ఆన్లైన్లో అలాగే ఉంచి ఈ వీడియోపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకున్నారు?” అని మెటా అధికారులను ప్రశ్నించారు. ఈ క్రమంలో పొరపాటు జరిగిందని మెటా అధికారులు క్షమాపణలు చెప్పారు. అయితే, క్షమాపణలు చెప్పారు. అయితే, క్షమాపణలు చెబితే సరిపోదని బాధ్యత వహించాలని ఎంపీలు చెప్పినట్లు తెలుస్తోంది.
తమ ప్లాట్‌ఫారమ్‌లలో ఉన్న వివాదాస్పద, అభ్యంతరకరమైన కంటెంట్‌పై కంపెనీ తీసుకున్న చర్యల వివరాలను కూడా మెటాను సభ్యులు కోరినట్లు తెలుస్తోంది. మెటా భారతదేశం నుంచి భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నప్పటికీ, ఈ దేశ చట్టాలను పాటించడం లేదని ఎత్తి చూపారు. సోషల్ మీడియాలో అసమ్మతికి చోటు ఉండటం తప్పనిసరి అని, ప్రభుత్వ వ్యతిరేక కంటెంట్‌ను దేశద్రోహంగా పరిగణించకూడదని ప్యానెల్‌లోని ప్రతిపక్ష ఎంపీలు అన్నట్లు తెలుస్తోంది.
“ఆ వీడియోను ఐదు గంటల పాటు తొలగించినట్లు వారే (మెటా) అంగీకరించారు. రాత్రి 12:30 నుంచి ఉదయం 5:00 గంటల వరకు అది అందుబాటులో లేకుండా పోయింది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇలా మెటా ఒక వీడియోను తొలగించడం ఇది మొదటిసారి కాదు. 2024లో మార్క్ జుకర్‌బర్గ్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు” అని గుర్తు చేశారు.
“దేశాన్ని అస్థిరపరచడమే వారి మనస్తత్వం. ప్రధానమంత్రి వీడియోను ఐదు గంటల పాటు తొలగించారు. వారు హోం వ్యవహారాలు, ఐటీ మంత్రిత్వ శాఖల ఆదేశాలను వినరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియోను తొలగించినందుకు మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పాలి. ఒకవేళ జుకర్‌బర్గ్ క్షమాపణ చెప్పకపోతే, సెక్షన్ 79 కింద వారికి ఉన్న సేఫ్ హార్బర్ రక్షణను వెనక్కి తీసుకోవాలి.” అని దుబే స్పష్టం చేశారు.
“ప్రధాని వీడియోను ఎందుకు తొలగించారు? ఇందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? అభ్యంతరకరమైన ఇతర కంటెంట్‌ను ఆన్లైన్లో అలాగే ఉంచి ఈ వీడియోపై మాత్రం ఎందుకు చర్యలు తీసుకున్నారు?” అని మెటా అధికారులను ప్రశ్నించారు.

More Stories
ఉప ఎన్నికల ఫలితాలు ఊహించలేదు
నాలుగు రాష్ట్రాల్లో పేపర్ లీక్ లపై ఉద్యమాలకు ఎబివిపి మద్దతు
ఇస్లామిస్టులతో కలిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు