ఇస్లామిస్టుల‌తో క‌లిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు

ఇస్లామిస్టుల‌తో క‌లిశాక లెఫ్టిస్టులు అవుతున్నారు

ఇస్లామిస్టుల‌తో కలిసిన త‌ర్వాత హిందూ మ‌హిళ‌లు క‌రుడుక‌ట్టిన వామ‌ప‌క్ష‌వాదుల త‌ర‌హా మారుతున్న‌ట్లు సినీ నటి, బిజెపి ఎంపీ కంగనా రనౌత్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఎక్స్ పోస్ట్ లో ఓ వీడియోలో తానొక జాగృత హిందూ మహిళా అని పేర్కొంటూ మ‌ధ్య‌స్త హిందువు మ‌హిళ‌గా ఉన్న తాను జాగృతి చెందిన హిందువుగా మారిన‌ట్లు తెలిపారు. కొన్ని రోజుల క్రితం కాక్రోచ్ జ‌న‌తా పార్టీపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారామె. 

తాజా వీడియో మెసేజ్‌లో కంగ‌నా ర‌నౌత్ మాట్లాడుతూ ఒక ఫీలింగ్ షేర్ చేసుకోవాల‌ని ఉంద‌ని, పార్ల‌మెంట్‌కు వెళ్ల‌డం ఆల‌స్యం అవుతున్నా, త‌న మనోభావాలను పంచుకోవ‌డం ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ గురించి ఆమె త‌న వీడియోలో ప్రస్తావిస్తూ అనేక మంది హిందువు మ‌హిళ‌ల‌తో త‌న‌కు ప‌రిచంయ ఉంద‌ని, కానీ ఎవ‌రికీ రాజ‌కీయంగా కానీ, మ‌త‌ప‌రంగా కానీ చాలా వ‌ర‌కు మ‌హిళ‌ల్లో అవ‌గాహ‌న ఉండేదికాద‌ని చెప్పారు. 

సాధార‌ణంగా యువ‌త‌లో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయ‌ని, వాళ్లు త‌ట‌స్థంటా ఉంటార‌ని ఆమె పేర్కొన్నారు. కానీ ఇస్లామిస్టుల‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఆ మ‌హిళ‌ల్లో మార్పులు వ‌స్తుంటాయ‌ని కంగ‌నా అన్నారు. ఇస్లామిస్టుల‌తో క‌లిసిన త‌ర్వాత లెఫ్టిస్టులు అవుతార‌ని, దీంట్లో ఎటువంటి న‌ష్టం లేద‌ని, ఎందుకంటే రాజ్యాంగం వాళ్ల‌కు ఆ స్వేచ్ఛ ఇచ్చింద‌ని, మ‌న‌కు కావాల్సిన ఏదైనా మ‌తాన్ని కానీ, ఐడియాల‌జీని కానీ స్వీక‌రించ‌వ‌చ్చని ఆమె స్పష్టం చేశారు.  

అయితే తాను ఇప్పుడు మ‌ధ్యస్థ హిందువును కాదని చెబుతూ ఇప్పుడు త‌న‌ను వేధిస్తున్నార‌ని, సంఘ్‌ప‌రివార్‌లో ఎప్పుడు చేరాన‌ని అడుతున్నార‌ని తెలిపారు. ఇప్పుడు నేనొక జాగృతి పొందిన హిందువును అని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ త‌ర‌హా లాంటి హిందువును అని, మార్పిడి జ‌ర‌గాల‌ని కోరుతున్నానని ఆమె వివరించారు. హిందువు మ‌హిళ‌లు ఓ నిర్దిష్ట ఐడియాల‌జీ ఐడెంటిటీ కోసం పోరాటం చేయాల‌ని ఆమె సూచించారు. మార్పిడితో చైత‌న్యం పొందాల‌ని చెబుతూ మ‌రి ఆ దారిని ఎందుకు మూసివేస్తున్నార‌ని ఆమె అడిగారు.