* ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, ఉత్తమ నటిగా యామీ గౌతమ్
కేంద్రం 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను కేంద్రం ఈ పురస్కారాలను ప్రకటించింది. 2024 ఏడాదికి గాను ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీలో ఉత్తమ తెలుగు చిత్రంగా కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు కూడా కమిటీ కుర్రోళ్లు సినిమాకు పనిచేసిన పి. రవికుమార్ కి దక్కింది.
మెగా కూతురు నిహారిక కొణిదెల సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైంది. కొత్త నటీనటులతో, పల్లెటూరి నేపథ్యంలో స్నేహం, రాజకీయం, భావోద్వేగాల చుట్టూ సాగే అద్భుతమైన కథాంశంతో దర్శకుడు యదు వంశీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
ఉత్తమ తమిళ సినిమాగా ‘రాయన్’ నిలువగా.. ఉత్తమ మలయాళ చిత్రం- ఫెమినిస్ట్ ఫాతిమా, ఉత్తమ హిందీ చిత్రం శ్రీకాంత్. ఉత్తమ కన్నడ చిత్రం మిథ్య అవార్డులు గెలుచుకున్నాయి. తెలుగు సినిమాలకు 9 జాతీయ అవార్డులు దక్కాయి.ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో అవార్డుల విజేతలు
- ఉత్తమ నటుడు (షేర్డ్) : మమ్ముట్టి (భ్రమయుగం), కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్)
- ఉత్తమ నటి : యామీ గౌతమ్ (ఆర్టికల్ 370)
- ఉత్తమ దర్శకుడు: అమరన్ (రాజ్‌కుమార్ పెరియసామి)
- ఉత్తమ సహాయ నటి (షేర్డ్): మహారాజ (సచన నమిదాస్), మిథ్య (రూపశ్రీ వర్కాడే)
- ఉత్తమ సహాయ నటుడు: భక్షక్ (సంయ్ మిశ్రా)
- ఉత్తమప్రజాదరణ చిత్రం: కల్కి 2898 ఏడీ
- ఉత్తమ తెలుగు చిత్రం: కమిటీ కుర్రాళ్లు
- ఉత్తమ తమిళ చిత్రం: రాయన్
- ఉత్తమ మరాఠీ చిత్రం: ముక్కమ్ పోస్ట్ బొంబిల్ వాడి
- ఉత్తమ ఒడియా చిత్రం: లహరి
- ఉత్తమ తుళు చిత్రం: ఇంబు
- ఉత్తమ గర్వాలీ చిత్రం: ధోలి
- బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్: సుకుమార్ ( పుష్ప 2 )
- బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ (పుష్ప 2), దీపాలీ నూర్
- ఉత్తమబాలల చిత్రం: 35 చిన్న కథ కాదు
- ఉత్తమ బాల నటుడు: అరుణ్‌దేవ్ పోతుల
- బెస్ట్ మేకప్: కమిటీ కుర్రాళ్లు: పి. రవికుమార్
- బెస్ట్ మ్యూజిక్ (నేపథ్యం): అమరన్ (జీవీ ప్రకాశ్ కుమార్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: కల్కి 2898 ఏడీ( నితిన్ జిహానీ)
- బెస్ట్ యాక్షన్: మహారాజా (తమిళ్)
నాన్ -ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ
డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్ వంటి విలక్షణమైన విభాగాల్లో జాతీయ ముద్ర వేసిన విజేతల వివరాలు:
- స్పెషల్ జ్యూరీ అవార్డు: చోలా డోరా ఔర్ సుయ్ (హిందీ), భద్రకాళి నాటకం (మలయాళం)
- ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లఘు చిత్రం): హమ్‌సఫర్ (మరాఠీ)
- ఉత్తమ డాక్యుమెంటరీ: రామ్-నామి (హిందీ)
- ఉత్తమ స్క్రిప్ట్: ఫరాజ్ అలీ (‘ఓబర్’ హిందీ-కశ్మీరీ చిత్రం)
- ఉత్తమ మ్యూజిక్ డైరెక్షన్ (సంగీతం): శివ్ పాల్‌సింగ్ కాంగ్ (‘పరాట్ 41 డిగ్రీస్ ఛాయా మగవీర్’ చిత్రం)
- ఉత్తమ వాయిస్ ఓవర్: సుందరాయ జయచంద్రన్ (‘లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్’ ఇంగ్లీష్ చిత్రం)
- ఉత్తమ యానిమేషన్ చిత్రం: టచ్డ్ ఏజ్ వాటర్
- ఉత్తమ సామాజిక, పర్యావరణ విలువలు కలిగిన చిత్రం: పిప్లంత్రి: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం
- ఉత్తమ ఆర్ట్/కల్చర్ (కళా-సాంస్కృతిక చిత్రం): మెయిన్ నిదా (హిందీ)
- ఉత్తమ హిస్టారికల్ రీకన్స్ట్రక్షన్ కాంపిలేషన్ మూవీ: కకోరి (హిందీ)
వివిధ భాషా చిత్రాల సమాహారంగా ప్రకటించిన ఈ 72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలకు, డాక్యుమెంటరీలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేయడం విశేషం.

More Stories
వాంగ్‌చుక్ చికిత్సపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరణ
జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు
ఈ ఏడాది ఇస్రో 7 ప్రయోగాలు