* ఉక్రెయిన్ తో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన క్షిపణుల వ్యవస్థ భారీగా అభివృద్ధి
నాలుగేళ్లకు పైగా రష్యా పూర్తిస్థాయి దండయాత్రను ఎదుర్కోవడంలో కీవ్‌కు ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకుని, బాలిస్టిక్ క్షిపణుల నుండి ఐరోపాను రక్షించడానికి ఉక్రెయిన్, మరో తొమ్మిది దేశాలు సోమవారం ఒక కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. “ఐరోపా కోసం ఉమ్మడి బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యాన్ని నిర్మించడమే మా లక్ష్యం,” అని పారిస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో జరిపిన చర్చల సందర్భంగా ఆ 10 దేశాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
రష్యా క్షిపణి దాడుల వల్ల తన దేశం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఈ ఖండంలో మాస్కో విస్తృత ఆశయాల పట్ల మిగిలిన ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయని, అటువంటి దాడులకు వ్యతిరేకంగా చర్యలు అభివృద్ధి చేయడంలో సహాయం చేయాలని ఆయన రెండు డజన్ల మంది నాయకులను కోరారు. క్రూయిజ్ క్షిపణులు లేదా డ్రోన్‌ల కంటే ఆపడం కష్టతరమైన “బాలిస్టిక్ క్షిపణుల వల్ల పెరుగుతున్న ముప్పును” తాము గుర్తించినట్లు జెలెన్స్కీ, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ కింగ్‌డమ్ నాయకులు తెలిపారు.
“భవిష్యత్ క్షిపణి ముప్పులను నిరోధించడానికి, నిర్వీర్యం చేయడానికి, ఐరోపాను రక్షించడానికి ఒక సమగ్ర పరిష్కారం, అంటే సమీకృత క్షిపణి రక్షణ వ్యవస్థ అవసరమని మేము విశ్వసిస్తున్నాము,” అని ఆ ప్రకటన పేర్కొంది. “రష్యా సాగించిన దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా తనను తాను రక్షించుకోవడం ద్వారా ఉక్రెయిన్ పొందిన విశిష్ట అనుభవాన్ని మేము గుర్తిస్తున్నాము” అని వెల్లడించారు.
ఈ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆ ప్రకటన ఎటువంటి కాలపరిమితిని ఇవ్వలేదు. ఈ ప్రణాళిక ఇతర దేశాలకు కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. రాబోయే 12 నెలల్లోగా, ఉక్రెయిన్, దాని భాగస్వాములు కలిసి భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల, తక్కువ ఖర్చుతో కూడిన క్షిపణుల వ్యవస్థను అభివృద్ధి చేయగలరని, ఇది ఐరోపాకు కొత్త యాంటీబాలిస్టిక్ సామర్థ్యాన్ని సమకూర్చుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా రక్షణ అవసరమైన ఇతరులకు దానిని అందించడానికి వీలు కల్పిస్తుందని జెలెన్ స్కీ తెలిపారు.
ఐరోపా విదేశాంగ మంత్రులు బ్రస్సెల్స్‌లో విడివిడిగా సమావేశమై, ఉక్రెయిన్ అవసరాలు, ఖండానికి రష్యా నుండి పొంచి ఉన్న ముప్పుల గురించి చర్చించారు. శీతాకాలానికి ముందే తమ వాయు రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఐరోపా దేశాలతో కలిసి ప్రయత్నాలను వేగవంతం చేయాలని జెలెన్స్కీ ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే, శీతాకాలంలో రష్యా సాధారణంగా ఉక్రేనియన్లకు విద్యుత్, వేడి, నీటిని అందకుండా చేయడానికి తన దాడులను తీవ్రతరం చేస్తుంది.

More Stories
ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడిని మోదీ ఆపేశారు
పీవోకేలో పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది మృతి
హసీనాపై న్యాయ పక్రియ అమలు తప్పదు.. బంగ్లాదేశ్ స్పష్టం