ఆ స్వరం ఇక వినిపించదు. కానీ ఆమె ఆలపించిన వేలాది పాటలు తరతరాల హృదయాల్లో మార్మోగుతూనే ఉంటాయి. ఆరు దశాబ్దాలపాటు తన మధుర గానంతో కోట్లాది మంది సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసిన దిగ్గజ నేపథ్య గాయని ఎస్. జానకి అంతిమయాత్ర ముగిసింది. ‘జానకమ్మ’గా అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే గాన కోకిలకు ఆదివారం సాయంత్రం మైసూరులో కన్నీటి వీడ్కోలు పలికారు.
మైసూరులోని కనియనహుండి ఫామ్‌హౌస్‌లో జానకి అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. శ్వాసకోశ సమస్యతో బాధ పడుతున్న ఆమె శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదేశాల మేరకు పోలీసు బృందం గౌరవ వందనం సమర్పించి గాల్లోకి కాల్పులు జరిపింది.
వేద మంత్రో చ్ఛారణల మధ్య జానకి మనవరాలు అప్సర విద్యుల తన నానమ్మ చితికి నిప్పంటించి అం త్యక్రియలు నిర్వహించారు. మట్టి కుండను చేత బట్టి మండుతున్న చితి చుట్టూ ప్రదక్షిణ చేసి, తన నానమ్మకు అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. అప్సర విద్యుల జానకి కుమారుడు మురళీకృష్ణ కుమార్తె. మురళీకృష్ణ ఈ ఏడాది జనవరి 22న కన్నుమూశారు.
కనియనహుండికి తరలించడానికి ముందు జానకి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం మహారాజా కళాశాల మైదానంలో ఉంచారు. కన్నడతోపాటు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు, నేపథ్య గాయకులు, వేలాది మంది అభిమానులు తరలివచ్చి తమ అభిమాన గాన కోకిలకు కన్నీటి నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మైసూరు జిల్లా ఇన్చార్జి మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య హాజరై జానకి పార్థివదేహానికి నివాళులర్పించారు.
జానకి మృతిపై కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారత సంగీత ప్రపంచంలోని గొప్ప దిగ్గజాల్లో ఆమె ఒకరని కొనియాడారు. జానకి సంగీత వారసత్వం చిరస్థాయిగా నిలి చిపోయేలా చర్యలు చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. “భారతదేశ అత్యంత ప్రతిష్ఠాత్మక సంగీత దిగ్గజాల్లో ఒకరు.. ‘గాన కోకిల’గా పేరు పొందిన జానకి ఇప్పుడు మన మధ్య లేరు. దాదాపు 50 ఏళ్లపాటు అన్ని భాషల సినీ పరిశ్రమలకు ఆమె తన గానంతో సేవలందించారు” అని శివకుమార్ పేర్కొన్నారు.
ఎస్. జానకి మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ పెక్రోన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు రెండు, మూడు తరాల ప్రజలను అలరించాయని రాసుకొచ్చారు. ఆమె మధురమైన పాటలు భవిష్యత్తులోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. జానకి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
ఎస్. జానకి మరణం పట్ల ఉపరాష్ట్రపతి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె గానం తరతరాలుగా కోట్లాది మంది హృదయాలను హత్తుకుందని అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అనేక భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.
మరోవైపు ఎస్ జానకి మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఆమె సేవలను స్మరించుకుంటూ సంతాప తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఓ అపూర్వ గాన దిగ్గజాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ఎస్. జానకి మరణంతో దేశం ఓ సంగీత దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.
ఆమె అద్భుతమైన గాత్రం తరతరాల సంగీతాభిమానులను అలరించిందని తెలిపారు. ఆరు దశాబ్దాలకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో దాదాపు 20 భారతీయ భాషల్లో వేలాది పాటలు ఆలపించి చిరస్థాయిగా నిలిచారని ఆమె కొనియాడారు. హిందీ, ఒడియా, తుళు, ఉర్దూ, పంజాబీ, బెంగాలీ సహా అనేక భాషల్లో ఆమె అందించిన గానసేవ అమూల్యమని పేర్కొన్నారు. ఆమె పాటలు శాశ్వతంగా సంగీత ప్రపంచంలో నిలిచిపోతాయని, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు రాష్ట్రపతి వెల్లడించారు.
ఎస్. జానకి మరణం సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ప్రధాని నరేంద్ర మోదీ పెక్రోన్నారు. వివిధ భాషల్లో ఆమె పాడిన పాటలు రెండు, మూడు తరాల ప్రజలను అలరించాయని రాసుకొచ్చారు. ఆమె మధురమైన పాటలు భవిష్యత్తులోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. జానకి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
ఎస్. జానకి మరణం పట్ల ఉపరాష్ట్రపతి కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె గానం తరతరాలుగా కోట్లాది మంది హృదయాలను హత్తుకుందని అన్నారు. ఆరు దశాబ్దాలకు పైగా అనేక భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీతాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు.

More Stories
రామ మందిర్ సీఈఓ ట్రస్ట్ కు జవాబుదారీ!
రష్యా సైనికులకు చైనా రహస్యంగా శిక్షణ?
అస్త్ర మార్క్-2 క్షిపణుల తయారీలో ప్రైవేట్ కంపెనీలకు అవకాశం