తెల్లారితే పుట్టినరోజు.. క్లబ్‌ డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి

తెల్లారితే పుట్టినరోజు.. క్లబ్‌ డ్యాన్సర్‌ అనుమానాస్పద మృతి
`నీకోసం నా దగ్గర ఒక పుట్టినరోజు బహుమతి ఉంది’ అంటూ అర్ధరాత్రి 12.30కు తన స్నేహితురాలికి వీడియోకాల్‌ చేసింది. మరుసటి రోజు తన పుట్టినరోజు అని తీసుకున్నానని చెప్పింది. ఆ తర్వాత హోటల్‌గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడితో కలిసి హోటల్‌కు వచ్చిన ఆమె, తెల్లవారితే తన పుట్టినరోజు ఉందనగా ఇలా విగతజీవిగా మారడం పలు అనుమానాలకు, ప్రశ్నలకు తావిస్తోంది.  
 
హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జీ గదిలో ఇరవై ఆరు ఏళ్ల వయసున్న రేణుక అనే యువతి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ వెంకటరాములు తెలిపిన వివరాల ప్రకార పాతబస్తీ మూసాబౌలితి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు తీసుకుంది. ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. 
 
రేణుక కూకట్‌పల్లి ప్రాంతంలో పేరొందిన కింగ్స్ అండ్ క్వీన్స్ క్లబ్‌లో డాన్సర్‌గా వృత్తి జీవితం సాగిస్తోంది. గతంలో ముకాబౌలి ప్రాంతంలో నివాసం ఉన్న ఆమె, కొంతకాలంగా బొల్లారంలో సోదరితో కలిసి నివసిస్తోంది. సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఆమెకు మరొకరితో వివాహం జరగ్గా, భర్తతో ఏర్పడిన తీవ్ర విభేదాల కారణంతో అతనికి పూర్తిగా దూరంగా ఉంటోంది. ఆమెకు ఏడేళ్ల వయసున్న ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
 
కాగా, గత ఆరు నెలలుగా గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫరూఖ్ అనే వ్యక్తితో ఆమె ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఫరూఖ్‌కు అప్పటికే వివాహమై భార్య, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఫరూక్ ఆమెకు ఆమె డాన్స్ చేస్తున్న పబ్ లో పరిచయమయ్యాడు. కొద్ది రోజుల క్రితం డిసిపి రితిరాజ్ ఆ పబ్ పై మారువేషంలో దాడి చేసి అక్కడ యువతులతో ఆకర్షిస్తూ అనైతిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నట్లు కనుగొని కేసు నమోదు చేశారు. 
గతవారం ఉదయం  వీరిద్దరూ కలిసి లంగర్ హౌస్ పరిధిలోని సదరు హోటల్‌కు వచ్చి గది అద్దెకు తీసుకున్నారు. హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత రాత్రి సమయంలో ఇద్దరూ కలిసి బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. భోజనం పూర్తయిన తర్వాత ఒక ముఖ్యమైన శుభకార్యానికి హాజరు కావాల్సి ఉందని చెప్పి ఫరూఖ్ హోటల్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు.
రాత్రి సుమారు పన్నెండున్నర గంటల సమయంలో రేణుక తన స్నేహితుడికి మొబైల్ ఫోన్ ద్వారా వీడియో కాల్ చేసింది.  “ఆ మహిళ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:24 గంటలకు తన స్నేహితుడు సత్యతో వీడియో కాల్‌లో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఆమె బుధవారం ఉదయం ఒక వ్యక్తితో కలిసి ఆ హోటల్‌లో దిగింది,” అని లంగర్ హౌజ్ సబ్-ఇన్‌స్పెక్టర్ సయ్యద్ మున్వర్ అలీ తెలిపారు.
మరుసటి రోజు తన పుట్టినరోజు అని చెబుతూ.. ‘నీకోసం నా దగ్గర ఒక బర్త్‌డే గిఫ్ట్ ఉంది’ అని ఆ స్నేహితుడితో చాలా ఆవేదనగా, నిరాశగా మాట్లాడింది. ఆ వీడియో కాల్ సంభాషణ ముగిసిన కాసేపటికే ఆమె తాను అద్దెకు తీసుకున్న హోటల్ గదిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు ప్రస్తుతం శవపరీక్ష నివేదిక కోసం ఎదురు చూస్తున్నారు.