ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జూలై 3 నుంచి జూలై 9 వరకు ఇరాన్ తో పాటు మరికొన్ని నగరాల్లో జరగనున్నాయి. వారం రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నేతలు హాజరు కానున్నారు. ప్రపంచ దేశాల నుంచి దాదాపు 2 కోట్ల మంది హాజరు కావచ్చని తెలుస్తోంది. గత ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో అయతొల్లా ఖమేని (86)తోపాటు పలువురు అతడి కుటుంబ సభ్యులు మరణించిన సంగతి తెలిసిందే.
ఖమేనితో పాటు మిగతా వారికి ఇరాన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీగా ఈ అంత్యక్రియల్ని నిర్వహించబోతుంది. దీనిలో భాగంగా వివిధ దేశాలకు చెందిన అధినేతలు, ప్రతినిధులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ ఆహ్వానం పలికింది. ఖమేని అంత్యక్రియలకు మోదీ రావాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కోరారు.
అయితే, వివిధ కారణాల రీత్యా మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. కానీ, ఇరాన్ ఆహ్వానాన్ని మన్నించి ఇండియా తరఫున ప్రతినిధులను ప్రభుత్వం అధికారికంగా పంపించనుంది. ఇండియా తరఫున కేంద్ర మంత్రి పవిత్రా మార్గెరిటా, బిహార్ గవర్నర్ సయ్యద్ అటా హస్నైన్ హాజరుకానున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలంటూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలకు కూడా ఆహ్వానం అందినట్లు సమాచారం అందుతోంది.
జూలై 4 న మార్గెరిటా, హస్నైన్ భారత్ తరఫున హాజరుకానున్నట్లు స్పష్టం అవుతోంది. ఖర్గేను కాంగ్రెస్ నాయకులు సాల్మన్ ఖుర్షీద్, పవన్ ఖెరాలను ఇరాన్ ఆహ్వానించింది. పార్టీ ప్రతినిధులు ఇరాన్ వెళ్లడంపై ఖర్గే ఖరారు చేసే పనిలో ఉన్నారని కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి ఖుర్షీద్ చెప్పారు.
భారత్ కాకుండా చైనా, రష్యా, పాకిస్థాన్, ఖతార్ నుంచి కూడా అంత్యక్రియలకు భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరు కానున్నారు. మరోవైపు ఇరాన్ మీడియా ఇదే విషయంపై కీలక ప్రకటన చేసింది. ఇస్లాం స్కూల్ ను పాటించే అందరూ ఈ అంత్యక్రియల్లో ఫ్రీగా పాల్గొనచ్చని తెలిపింది. ఇరాన్ పై ఆసక్తి ఉన్నవాళ్లు కూడా ఈ కార్యక్రమానికి రావచ్చని పేర్కొంది.

More Stories
విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర భగ్నం!
ఆచారాలు పాటించకపోతే హిందూ వివాహం చెల్లదు
ఆర్మీ నూతన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్ ధీరజ్ సేథ్