అమెరికాతో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇరాన్ మళ్లీ హార్ముజ్‌ను మూసేసింది. ఇజ్రాయెల్. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు జరపడమే ఇందుకు కారణం. శనివారం కూడా దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడిచేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులకు నిరసనగానే ఈ చర్యకు దిగినట్టు తెలిపింది.
ఈ మేరకు ఇరాన్ జాయింట్ మిలిటరీ టాప్ కమాండ్ అయిన ఖతమ్ అల్ అన్బియా సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్ ప్రకటించింది. అంతేకాదు ఇజ్రాయెల్ చర్యలపై ఇది ప్రాథమిక స్పందన మాత్రమే అని, ఇకపై దాడులు ఆపకుంటే, పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంకా కఠిన చర్యలు తీసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. దాడులు కొనసాగితే తీవ్ర పరిణామాలుంటాయని స్పష్టం చేసింది.
హిజ్బుల్లా “పదేపదే కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నందుకు” ప్రతీకారంగా లెబనాన్‌లో తాజా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం తెలిపాయి. అదే సమయంలో, తమ పౌరులను, బలగాలను రక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని కూడా స్పష్టం చేశాయి. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, హిజ్బుల్లా ఇజ్రాయెల్ బలగాలపై 50కి పైగా దాడులు చేసిందని ఇజ్రాయెల్ వైమానిక దళం పేర్కొంది. దీనికి ప్రతీకారంగా, రాత్రికి రాత్రే జరిపిన దాడులలో డజన్ల కొద్దీ “ఉగ్రవాద మౌలిక సదుపాయాలు”, ఉగ్రవాదులపై దాడి చేశామని కూడా తెలిపింది.
పశ్చిమాసియాపై ఇరాన్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇరాన్ నిర్ణయంతో అక్కడి నౌకల కదలికలు నిలిచిపోయాయి. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంలో లెబనాన్‌పై దాడులు ఆపేయాలనేది ఒక నిబంధన. కానీ, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నెతనాహ్యు మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినా వినిపించుకోవడం లేదు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
అటు అమెరికా, ఇరాన్ మధ్య, ఇటు లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరినప్పటికీ ఇజ్రాయెల్ శనివారం డ్రోన్లతో దాడి చేయడం సంచలనంగా మారింది. మరోవైపు ఇజ్రాయెల్ దాడులపై అమెరికా కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా దాడులు చేయడాన్ని తప్పు పడుతోంది. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నెతన్యాహు తనకు చాలా మంచి మిత్రుడు అని, అయితే, ఆయన చర్యలను అడ్డుకోక తప్పదని ట్రంప్ స్పష్టం చేశారు.
వాస్తవానికి అమెరికా- ఇరాన్ ఒప్పందంలో ఇటు ఇజ్రాయెల్ గానీ, అటు హెజ్బొల్లా గానీ భాగస్వాములు కావు. తాము హెజ్బొల్లాను పూర్తిగా నిర్మూలించే వరకు దక్షిణ లెబనాన్ నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. అటు హెజ్బొల్లా కూడా తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు చేస్తే ప్రతిఘటించి తీరుతామని ప్రకటించింది.
ఈ దాడుల వల్ల స్విట్జర్లాండ్‌లో అమెరికా, ఇరాన్, ఖతార్ దౌత్యవేత్తల మధ్య జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలు మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ భీకర యుద్ధం వల్ల ఇప్పటివరకు ఇరాన్, లెబనాన్లలో 8,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

More Stories
అయోధ్య అంశాన్ని 2027 అసెంబ్లీ ఎన్నికల్లోకి లాగే ప్రయత్నం
భగవంత్ మాన్ హాజరు వీడియోను విడుదల చేసిన అకల్ తఖ్త్
ఎఫ్ఏటీఎఫ్ ఉపాధ్యక్షునిగా మొదటిసారి భారతీయ అధికారి అగర్వాల్