అమెరికాలో భారతీయ సంతతి మహిళ నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్ మేయర్ ఎన్నిక రేసులో ముందంజలో ఉన్నారు. ఓ మీడియా సంస్థ నివేదిక ప్రకారం నిత్యా రామన్ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం వెలువడిన ఓట్ల నవీకరణ తర్వాత, లాస్ ఏంజిల్స్ మేయర్ పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలలో రెండవ స్థానం కోసం జరుగుతున్న పోటీలో, నిత్యా రామన్ మాజీ రియాలిటీ టీవీ స్టార్ స్పెన్సర్ ప్రాట్‌ను అధిగమించారు.
నగర కౌన్సిల్ సభ్యురాలైన రామన్, ఆదివారం లాస్ ఏంజిల్స్ కౌంటీ నివేదించిన దాదాపు 48,000 ఓట్లలో సుమారు 40% గెలుచుకున్నారు. ఆమె ప్రాట్ కంటే 10,000 ఓట్లు అధికంగా సాధించి, దాదాపు 3,000 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ప్రస్తుత మేయర్ కారెన్ బాస్‌తో నవంబర్‌లో జరిగే రన్ఆఫ్కు ఎవరు అర్హత సాధిస్తారో తేల్చడానికి నిత్యా రామన్ మరియు స్పెన్సర్ ప్రాట్ ఇంకా వేచి చూస్తున్నారు.
కేరన్ బ్రాస్, స్పెన్సర్ ప్రాట్పై జూన్ 2వ తేదీన జరిగిన ప్రైమరీలో అత్యధిక ఓట్లను సాధించింది. దీంతో నిత్యా రామన్ ఓట్ షేర్లో 5 పాయింట్లతో ముందున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రాట్ పోటీ చేస్తుండగా, నిత్యా రామన్ మాత్రం ప్రోగ్రెసివ్ అభ్యర్థిగా పోటీపడుతున్నారు. కాలిఫోర్నియాలో ఎన్నికల ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుంది.
మెయిల్ ద్వారా ఎక్కువగా ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికల తేదీ ముగిసిన వారం రోజుల వరకు కూడా పోస్టుమార్క్ బ్యాలెట్లను లెక్కిస్తుంటారు. నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్లో సభ్యురాలు. ఆమె అర్బన్ ప్లానర్. హార్వర్డ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎంఐటీ యూనివర్సిటీలో కూడా ఆమె చదువుకున్నది. 2020లో సిటీ కౌన్సిల్ కోసం పోటీపడినట్లు ఆమె వెబ్సైట్లో ఉంది.
ఆ ఎన్నికల్లో ఘన విజయం ఆమె సాధించింది. సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన తొలి ఆసియా అమెరికన్ మహిళగా, తొలి దక్షిణాసియా వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. 2024 మార్చిలో నిత్యా రామన్ రెండోసారి సిటీ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. సిట్టింగ్ కౌన్సిల్ మెంబర్‌ను ఓడించిన రికార్డును నిత్యా రామన్ సొంతం చేసుకున్నట్లు ఏబీసీ న్యూస్ తెలిపింది. ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించడం లాంటి కార్యక్రమాలను ఆమె సిటీ కౌన్సిల్ మెంబర్‌గా నిర్వర్తించారు.
మేయర్ ఎన్నిక పార్టీలకు అతీతంగా జరుగుతుంది, కాబట్టి బ్యాలెట్ పత్రంపై ఏ అభ్యర్థి పేరు పక్కన కూడా వారి పార్టీ గుర్తింపు లేదు. రామన్, బాస్ ఇద్దరూ డెమోక్రాట్లు కాగా, ప్రాట్ రిపబ్లికన్.

More Stories
హెచ్1బీ వీసాలపై లక్ష డాలర్ల ఫీజ్ కొట్టేసిన కోర్ట్
భారతీయ సిబ్బంది ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై కాల్పులు
ఇరాన్‌పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడులు