ఉమ్మడి పౌరస్మృతి బిల్లును సోమవారం అస్సాం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బహుభార్యత్వాన్ని నిషేధించాలని, లివిన్ రిలేషన్లను రిజిస్టర్ చేయాలని, పెళ్లి.. విడాకులు, వారసత్వం అంశాల్లో ఒకేరకమైన విధానాన్ని పాటించాలన్న ఉద్దేశంతో కేంద్ర సర్కారు యూసీసీ బిల్లును తీసుకువస్తున్నది. అయితే ఇటీవల ప్రభుత్వ ఏర్పాటు తర్వాత హిమంత బిశ్వ శర్మ సర్కారు తొలి క్యాబినెట్ భేటీలో ఆ బిల్లకు ఆమోదం తెలిపింది.
అయితే అస్సాంలో జీవిస్తున్న షెడ్యూల్ తెగల ప్రజలు ఈ బిల్లు వర్తించదు. సీఎం హిమంత బిశ్వ శర్మ తరపున మంత్రి అతుల్ బోరా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. యూసీసీ బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో అస్సాం మూడవ రాష్ట్రంగా నిలిచింది. ఇటీవల ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాలు కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టాయి. పెళ్లి, విడాకులు, వారసత్వం, సహజీవనం లాంటి చట్టాలను సరళతరం చేయాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆ న్యాయం పరిధిలోకి రావాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.
యూసీసీ ప్రకారం పురుషులు పెళ్లి చేసుకోవాలంటే కనీసం 21 ఏళ్లు ఉండాల్సిందే, మహిళలకు ఆ వయసును 18గా నిర్ణయించాయిరు. ఇక బహుభార్యత్వాన్ని నిషేధించారు. భార్యాభర్తలకు న్యాయపరమై హక్కుల లభించే ఉద్దేశంతో పెళ్లిళ్లు, విడాకుల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయనున్నారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. బహుశా మే 27న ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది.

More Stories
అన్నాడీఎంకేలో ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామా
పేపర్ లీక్ పై గుణపాఠాలు నేర్చుకొని ఎన్టీఏ
అక్రమ వలసదారుల కోసం బెంగాల్ లో నిర్బంధ కేంద్రాలు