మహారాష్ట్రలో నీట్, జేఈఈ ప్రిపేరయ్యే విద్యార్థులకు అతి పెద్ద కోచింగ్ బ్రాండ్‌గా ఆర్‌సీసీని ఆయన మార్చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో గత కొన్ని రోజుల నుంచి శివరాజ్‌ను సీబీఐ ప్రశ్నిస్తోంది. 1990 దశకంలో ఆయన సైకిల్‌పై తిరుగుతూ లాతూర్ సిటీలో కోచింగ్ ఇచ్చేవాడు. మొదట్లో ఓ రెంటు రూమ్‌లో పది మంది విద్యార్థులతో కోచింగ్ క్లాసులు నడిపారు.
ఆయనే స్వయంగా నోట్స్ రాసేవారు. ఆ నోట్స్ చదివి పిల్లలు కెమిస్ట్రీలో మంచి మార్కులు తెచ్చుకునేవారు. మెల్లమెల్లగా లాతూరులో ఇన్స్టిట్యూట్ను ఆయన ప్రారంభించారు. పోటీ పరీక్షలకు విద్యార్థులు ఆయన మెటీరియల్‌ను కొనేవారే. అంచలంచెలుగా లాతూర్ కోచింగ్ సెంటర్‌కు మహారాష్ట్రలో గుర్తింపు వచ్చింది. నీట్, జేఈఈ, సీఈటీ విద్యార్థులు ఆ సెంటర్‌కు చెందిన కెమిస్ట్రీ నోట్స్ చదివేవారు.
ఆర్సీసీ కోచింగ్ సెంటర్‌కు లాతూర్‌తో పాటు పూణె, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్, నాందేడ్, సోలాపూర్, కొల్హాపూర్ పట్టణాల్లో కూడా కేంద్రాలు ఉన్నాయి. సుమారు 40 వేల మంది విద్యార్థులు ఆ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్నారు. శివరాజ్ మోటేగాన్క్ కెమిస్ట్రీలో ఎంఎస్సీ గోల్డ్‌మెడలిస్టు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ పీవీ కులకర్ణితో శివరాజ్‌కు ఉన్న లింకులపై సీబీఐ ఆరా తీసింది. కెమిస్ట్రీ సంబంధిత ప్రశ్నలు లీకేజీ అయిన అంశంలో కులకర్ణిని అరెస్టు చేశారు. గతంలో ఆర్సీసీ కోచింగ్ సెంటర్లో కులకర్ణి క్లాసులు చెప్పినట్లు తెలుస్తోంది. పేపర్ లీక్ విషయంలో ఇద్దరికీ ఏవైనా సంబంధాలు ఉన్నాయా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
జస్టిస్ మనోజ్ జైన్ కు ఢిల్లీ మద్యం కేసు
కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్యను పెంచుతూ ఆర్డినెన్స్