నౌకాద‌ళం చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణ స్వామినాథ‌న్

నౌకాద‌ళం చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణ స్వామినాథ‌న్
భార‌తీయ నౌకాద‌ళం త‌దుప‌రి చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణ స్వామినాథ‌న్ నియ‌మితుల‌య్యారు. నావీ చీఫ్ అడ్మిర‌ల్ దినేశ్ కుమార్ త్రిపాఠి స్థానంలో ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. దినేశ్ త్రిపాఠి ప‌ద‌వీకాలం మే 31వ తేదీన ముగియ‌నున్న‌ది. వెస్ట్ర‌న్ నావెల్ క‌మాండ్‌లో ప్ర‌స్తుతం ఫ్లాగ్ ఆఫీస‌ర్ క‌మాండింగ్ ఇన్ చీఫ్‌గా స్వామినాథ‌న్ చేస్తున్నారు. 
 
నావ‌ల్ స్టాఫ్‌కు చీఫ్‌గా కూడా స్వామినాథ‌న్‌ను ప్ర‌భుత్వ నియ‌మించింది. ర‌క్ష‌ణ శాఖ దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. 1987 జూలై 1వ తేదీన భార‌తీయ నౌకాద‌ళంలో ఫ్లాగ్ ఆఫీస‌ర్‌గా స్వామినాథ‌న్ చేరారు. క‌మ్యూనికేష‌న్‌, ఎల‌క్ట్రానిక్ యుద్ధంలో ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌త ఉన్న‌ది.  ఖ‌ద‌క‌వ‌స‌లలో ఉన్న నేష‌న‌ల్ డిఫెన్స్ అకాడ‌మీలో చ‌దివారు.  బ్రిట‌న్‌లోని శ్రీవెన‌హంలో ఉన్న జాయింట్ స‌ర్వీసెస్ క‌మాండ్ అండ్ స్టాఫ్ కాలేజీలో చ‌దివారు. మ‌హారాష్ట్ర‌లోని క‌రంజా జిల్లాలో ఉన్న కాలేజ్ ఆఫ్ నావెల్ వార్‌ఫేర్‌లో ఉన్న గ‌డిపారు.
అమెరికా నివ్‌పోర్ట్‌లో ఉన్న నావ‌ల్ వార్ కాలేజ్‌లో కూడా చ‌దివారు. ప‌ర‌మ విశిష్ట సేవా మెడ‌ల్, అతి విశిష్ట సేవా మెడ‌ల్‌, విశిష్ట సేవా మెడ‌ల్ అందుకున్నారు. నౌకాద‌ళంలో అనేక కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆప‌రేష‌న‌ల్, స్టాఫ్‌, ట్రైనింగ్ అపాయింట్ చేప‌ట్టారు. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియ‌ర్ ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య కూడా ఉన్నాయి. నౌకాదశంలో కృష్ణ స్వామినాథన్ అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
క్షిపణి నౌకలు ఐఎన్‌ఎస్ విద్యుత్, వినాశ్; మిసైల్ కార్వెట్ ఐఎన్‌ఎస్ కులిశ్; గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్‌ఎస్ మైసూర్; విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలకు కమాండర్‌గా పనిచేశారు.  రియర్ అడ్మిరల్ హోదాకు పదోన్నతి పొందిన అనంతరం కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (ట్రైనింగ్)గా సేవలందించారు. భారత నౌకాదళంలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
నౌకాదళంలోని అన్ని విభాగాల్లో ఆపరేషనల్ భద్రతను పర్యవేక్షించే ఇండియన్ నావల్ సేఫ్టీ టీమ్ ఏర్పాటులో కూడా ఆయన ముఖ్య పాత్ర వహించారు.  వైస్ అడ్మిరల్ హోదాలో ఆయన వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా, కంట్రోలర్ ఆఫ్ పర్సనల్ సర్వీసెస్‌గా, నావల్ హెడ్‌క్వార్టర్స్‌లో చీఫ్ ఆఫ్ పర్సనల్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత బాధ్యతలకు ముందు నావల్ హెడ్‌క్వార్టర్స్‌లో వైస్ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్‌గా పనిచేశారు.