అలాగే మార్చి 2023 నుంచి జూన్ 2024 మధ్య ఆర్మీ సెంట్రల్ కమాండ్‌లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గానూ పని చేసిన అనుభవం ఉంది. దశాబ్దాల పాటు చేసిన దేశ సేవకు గాను అనేక ప్రతిష్టాత్మక గౌరవాలను ఎన్.ఎస్.రాజా అందుకున్నారు. పరమ విశిష్ట సేవా పతకం(పివిఎస్ఎం), అతి విశిష్ట సేవా పతకం (ఎవిఎస్ఎం), సేన పతకం (ఎస్ఎం), విశిష్ట సేవా పతకం (విఎస్ఎం) వంటి గౌరవాలని పొందారు.
కాగా, క్షేత్రస్థాయి అనుభవంతో పాటు, ఆయన తన విద్యా నేపథ్యానికి, రక్షణ సంబంధిత అంశాలపై గల వ్యూహాత్మక అవగాహనకు కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీ నుంచి ఆయన మాస్టర్స్ డిగ్రీ పొందగా, మద్రాస్ విశ్వవిద్యాలయంలో డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పూర్తి చేశారు. 1985 డిసెంబర్ 14వ తేదీన ఘర్వాల్ రైఫిల్స్‌కు చెందిన 8వ బెటాలియన్‌లో కమిషన్ అయ్యారు. ఆ తర్వాత అనేక యుద్ధాల్లో ఆయన సేవలందించారు.
అస్సాంలో చేపట్టిన ఆపరేషన్ రైనోలో కీలక పాత్ర పోషించారు. 16 ఘర్వాల్ రైఫిల్స్ కమాండర్‌గా చేశారు. జమ్మూకశ్మీర్‌లో 168 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్‌గా చేశారు. సెంట్రల్ సెక్టార్లో 17వ మౌంటేన్ డివిజన్లో చేశారు. వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఉన్న ఆర్మీకి చెందిన రెండు కీలక కార్ప్స్ దళాలకు ఆయన కమాండర్‌గా చేశారు.

More Stories
బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
నౌకాదళం చీఫ్‌గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్
తమిళనాడులో వామపక్షాలు మద్దతు ఇస్తున్నా ఉత్కంఠ!