దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ ఆడేవారి కోసం కేంద్రం కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చింది. గేమ్స్ ఆడేవారికి మేలు కలిగేలా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త రూల్స్‌పై మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే మే 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలుకాబోతున్నాయి. దేశంలో ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ చాలా పెద్దది. స్మార్ట్‌ఫోన్స్, ఇంటర్నెట్ డాటా తక్కువ ధరలో అందుబాటులో ఉండటం వంటి కారణాలతో చాలా మంది గేమింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు.
దీనివల్ల కొందరు ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఇకపై గేమింగ్ విషయంలో కంపెనీలు కొన్ని రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. సాధారణ, సోషల్ గేమ్స్‌కు సంబంధించి ఇకపై ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్స్ అవసరం లేదు. అయితే, అది ఈ స్పోర్ట్స్ అయినా లేదా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక గ్రూప్‌నకు సంబంధించిన గేమ్స్ అయినప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ అవసరం. ఈ నిర్ణయం మొబైల్ గేమింగ్ స్టార్టప్స్‌కు, చిన్న డెవలపర్లకు మేలు చేస్తుంది.
ఎక్కువ డాక్యుమెంట్లు వంటివి అవసరం లేకుండానే తమ గేమ్స్‌ను మార్కెట్లోకి తీసుకురావొచ్చు. మనీ సంబంధిత గేమ్స్, ఎక్కువ మంది కలిసి ఆడే గేమ్స్, హై రిస్క్ ఉన్న టైటిల్స్, అన్ని రకాల ఈ స్పోర్ట్ సంస్థలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఇప్పటికి ప్రత్యేక కేటగిరి అంటూ లేదు. కానీ, త్వరలోనే వీటిని కేటగిరిలుగా విభజిస్తారు. కొత్త రూల్స్ ప్లేయర్స్‌కు మరింత మేలు చేస్తాయి. వారికి మరింత భద్రత కల్పిస్తాయి. ఆటగాళ్ల ఫిర్యాదులకు కంపెనీలు ప్రాధాన్యమివ్వాలి.
అలాగే, సైబర్ సెక్యూరిటీ, సేఫ్ పేమెంట్ మానిటరింగ్, రెగ్యులర్ రిపోర్టింగ్ వంటి వాటికి అవకాశం ఇవ్వాలి. ఈ రూల్స్ వల్ల మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడే వారు మరింత సులభంగా, భద్రంగా గేమ్స్ ఆడుకోవచ్చు. ఇక, ఈ గేమ్స్, నిబంధనల్ని పర్యవేక్షించేందుకు కేంద్రం తాజాగా ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ఫైనాన్స్, బ్రాడ్‌కాస్టింగ్, హెల్త్, స్పోర్ట్స్, పవర్, జస్టిస్, విదేశీ వ్యవహారాల శాఖలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. వీరు ఆన్‌లైన్ గేమింగ్ సంస్థల రిజిస్ట్రేషన్స్, ఫిర్యాదులు, భద్రత వంటి అంశాల్ని పర్యవేక్షిస్తారు.

More Stories
పెట్రోల్ బదులుగా ఇథనాల్ వాడేందుకు త్వరలోనే ఈ-85 ఇంధనం
ప్రపంచ జీడీపీ ర్యాంకింగ్స్‌లో 6వ స్థానానికి భారత్
యుద్ధం తర్వాత 50 శాతం వరకు పెరిగిన చమురు ధరలు