ఇలా వాదోపవాదాలు సాగుతున్న తరుణంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ, చేతబడులు, నరమాంస భక్షణ లేదా నరబలి వంటి కొన్ని మూఢాచారాలు న్యాయస్థానం అంతరాత్మను దిగ్భ్రాంతికి గురిచేస్తే కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, ప్రజల శాంతి భద్రతలకు, నైతికతలకు లేదా ఆరోగ్యానికి భంగకరమైన వాటిని న్యాయస్థానాలు అడ్డుకోవచ్చని తెలిపారు.
కొన్ని కీలకమైన మతాచారాలను ప్రత్యేకంగా ఆ మత సిద్ధాంతాలు, ఆచారాల పరిధిలోనే అంచనా వేయగలుగుతామని, వేరే మతం ప్రామాణికాలను ఇక్కడ వర్తింపచేయలేమని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు. దేవాలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని ఏ భక్తుడూ సవాలు చేసి వుండేవారు కాదని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. రిట్ పిటిషన్ వేసినవారు భక్తులు కాదని పేర్కొంటూ ఎవరు వీరు? అని ప్రశ్నించారు.
ఈ దశలో సీనియర్ న్యాయవాది రాజీవ్ జోక్యం చేసుకుంటూ ఇటువంటి వైఖరి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అన్న భావనపై ప్రభావం చూపుతుందని తెలిపారు. అనేక పిటిషన్లు సమర్ధవంతమైన సంస్థలు దాఖలు చేస్తాయని పేర్కొంటూ ఈ కేసులో యంగ్‌ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంను ఆశ్రయించిందని తెలిపారు. ఒకవేళ భక్తులు కాని వారు అంటే ఆలయంతో సంబంధం లేనివారు ఈ తీర్పును సవాలు చేసి వుంటే ఈ కోర్టు ఆ రిట్ పిటిషన్‌ను స్వీకరించి వుండేదా? ముందుగా ఈ అంశాన్ని పరిష్కరించాల్సి వుందని తెలిపారు. .

More Stories
ఉగ్రవాదులతో సంబంధం.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు
ఇద్దరు చిన్నారులు మృతితో మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తత
ఎయిరిండియా బ్లాక్‌బాక్స్ డేటా కోరిన బాధితులు