కోవిడ్ వ్యాక్సిన్‌కు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా రాష్ట్రాలకు సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేయాలని ఆయన అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు, డీజీపీలకు సూచించారు.
కేంద్ర హోంశాఖ జారీ చేసిన మార్గదర్శకాలను జాగ్రత్తగా పాటించేలా చూడాలంటూ అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఆయన సూచించారు. అన్ని రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులు, డీజీపీలతో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కోవిడ్ కేసులను గుర్తించడానికి సమర్థమంతమైన నియంత్రణ వ్యూహం, పరీక్షల సదుపాయాన్ని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఇలా చేయడం ద్వారా మహమ్మారిని అరికట్టవచ్చని ఆయన తెలిపారు.
కోవిడ్ పై ఈ నెల ఆరో తేదీ లోపు రాష్ట్ర స్థాయిలో స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాలని, అలాగే అన్ని జిల్లాల స్థాయిల్లోనూ ఈ స్టీరింగ్ కమిటీ సమావేశాలు జరిగేలా చూడాలని రాజీవ్ గౌబా కోరారు.

More Stories
సోమనాథ్ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇంకా ఉన్నాయి
అత్యాచారం కేసులో బహిష్కృత కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ లో పాల్గొన్న ప్రధాని