60 రోజులకు సరిపడా నిల్వలుండగా, యుద్దం ప్రారంభమై 27 రోజులు మాత్రమే అవుతుందని తెలిపింది. ప్రపంచంలో ఎలాంటి పరిణామం ఎదురైనా ప్రతి పౌరుడికి రెండు నెలలకు సరిపడా చమురు దేశంలో అందుబాటులో ఉంటుందని చెప్పింది. పైగా, మరో రెండు నెలలకు అవసరమైన సరఫరాలు జరగబోతున్నాయని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అదనపు కొనుగోళ్లు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొంటూ భారతదేశం తన దిగుమతుల అవసరాల కంటే “చాలా ఎక్కువగా” ఉత్పత్తి చేస్తున్నందున, ఎల్‌పిజి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుందని ప్రభుత్వ పేర్కొంది.
ఎక్కడా, ఎలాంటి ఇబ్బంది లేదని, ధరలు కూడా ఎప్పట్లాగే ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారులు పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం క్యూ కడుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ సరఫరా లేదని జరుగుతున్న ప్రచారంతో జనాలు బంకుల వ్దద బారులు తీరుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎలాంటి చమురు కొరతా లేదని కేంద్రం తెలిపింది.
పెట్రో ఉత్పత్తుల్లో భారత్ ఐదో స్తానంలో ఉంది. అలాగే, ఆయిల్ రిఫైనరీలో ఇండియా నాలుగో స్థానంలో ఉంది. దేశంలో చమురు తగినంత ఉందని, అలాగే పెట్రో ఉత్పత్తుల్ని 150 దేశాలకు ఎగుమతి చేస్తున్నామని కూడా కేంద్రం తెలిపింది. దేశంలోని ప్రతి రిఫైనరి 100 శాతం పని చేస్తోందని, భారత్ లోని కంపెనీలు 60 రోజులకు సరిపడా క్రూడాయిల్ నిల్వలతో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది.
సరఫరాలో ఎలాంటి లోటూ లేదని, వ్యూహాత్మక నిల్వలతో కలిపి 74 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నట్లు ప్రకటించింది. దేశీయంగా ఎల్‌పిజి నిల్వలు కూడా తగినంత ఉన్నాయని, ఇక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కూడా పెంచామని పేర్కొంది. ఇప్పటికే అనేక దేశాల నుంచి కార్గోల ద్వారా చమురు దేశానికి రానున్నట్లు తెలిపింది.

More Stories
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించిన కేంద్రం
అన్ని పార్టీల విరాళాలకంటే బిజెపికి 10 రెట్లు అధికం
ప్రతి నాలుగు కొత్త కంపెనీల్లో ఒకటి బెంగళూరు, హైదరాబాద్ నుంచే