మంటలు చెలరేగిన వెంటనే బస్సు నుంచి 10 మంది ప్రయాణికులు హుటాహుటిన దిగిపోయారు. ప్రమాదం అనంతరం ఘటనాస్థలిని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలను ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆరా తీశారు. అదే విధంగా క్షతగాత్రులను తక్షణమే వైద్యసేవలకు తరలించేందుకు సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
ప్రమాదానికి బస్సు కండిషన్ సరిగా లేకపోవడమే కారణమని ప్రయాణికులంటున్నారు. అంతేకాకుండా యర్రగొండపాలెం వద్ద గంటసేపు బస్సును నిలిపివేసి సిబ్బంది మరమ్మతులు చేశారని తెలిపారు. ఇదిలావుంటే ప్రమాద సమయంలో బస్సు స్టీరింగ్ స్ట్రక్ అయిందని డ్రైవర్ చెబుతున్నారు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు తెలంగాణలోని జగిత్యాల నుంచి పామూరుకు బస్సు బయల్దేరింది.
ఈ క్రమంలో చీమకుర్తి నుంచి కంకర్ లోడ్‌తో మార్కాపురం వైపు టిప్పర్ వస్తుండగా ఉదయం 6 గంటల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ నుండి కనిగిరికి పుట్టింటికి వస్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఏడు నెలల గర్భిణి రుక్కు (25) మృతి చెందింది. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతవ్వడంతో, ఆమె కడుపులో ఉన్న బిడ్డతో సహా సజీవదహనమైంది.
మార్కాపురం జిల్లా, రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదస్థలం నుంచి సీఎంతో ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఫోనులో వివరాలను తెలిపారు. ఆపై గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. మర్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు మంత్రులు అనిత, జనార్థన్ రెడ్డితోపాటు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా ఎస్పీ, కలెక్టర్ తో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Stories
ఎవరూ చర్చించని ‘డచ్ డిసీజ్’, కొద్దిమందే సిద్ధంగా `ఏఐ తుఫాను’
అమెరికా 15-సూత్రాల శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్!
యుద్ధం ఆపాలని ట్రంప్ ను కోరిన మోదీ!