వైకుంఠము నుండి విష్ణుమూర్తి దుష్టసంహారం చేసి ధర్మరక్షణ చేయడం కోసం భూమిపైన మానవ రూపంలో శ్రీరామచంద్రునిగా జన్మించిన ప్రదేశమైన అయోధ్య శ్రీరామజన్మభూమిలో ‘కుశ మహారాజు’ భవ్యమైన మందిరం నిర్మించాడు, కాలం గడిచేకొద్దీ ఆలయం క్రమంగా శిథిలమైంది. అనేకసార్లు అనేక మంది రాజులు ప్రజలు పునరుద్ధరణ చేయగా చివరగా 1000 సంవత్సరాల క్రితం శ్రీహర్షుడు నిర్మాణం చేసినట్లుగా చరిత్ర చెబుతోంది.
అట్టి భవ్యమైన మందిరాన్ని 1528లో మధ్య ఆసియా నుండి వచ్చిన ముస్లిం ఆక్రమణకారుడు బాబర్ ఈ ఆలయంపై దాడి చేసి విధ్వంసం చేశాడు. ఆ ఆలయ శిథిలాల తోనే గుమ్మటం నిర్మించాడు. హిందువులు వ్యతిరేకించి అనేక పోరాటాలు చేశారు. ముస్లిం పాలకులు ఆ కట్టడాన్ని బాబ్రీ మసీదుగా పిలిచారు. హిందువులు ఆ కట్టడం ఎదురుగా భజనలు కీర్తనలు చేయడం బయటనే పూజలు చేయడం చేస్తుండేవారు. ఇలా 82 సార్లు యుద్ధాలు జరిగి నాలుగు లక్షల మంది భక్తులు బలిదానమైనారు.
చివరికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, విశ్వహిందూ పరిషత్ 1980 నుండి అయోధ్య శ్రీరామజన్మభూమి మందిర నిర్మాణం కోసం ఆందోళనా పగ్గాలు చేపట్టాయి. నిర్విరామంగా 40 సంవత్సరాలు చేసిన పోరాట ఫలితంగా విజయం లభించింది. అట్టి పోరాటాల క్రమం తెలుసుకుందాం.
*1983వ సంవత్సరం గంగా మాత-భారతమాత ఏకాత్మక రథయాత్ర సందర్భంగా ఆలయ విముక్తి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది.
* బీహార్ ‘సీతామడి’ నుండి అయోధ్య వరకు శ్రీరామజానకి రథయాత్ర.
అనంతరం…
*1988 రామశిల పూజలు, రామయజ్ఞలు, హనుమాన్ జాగరణ యజ్ఞాలు, జలాభిషేకాలు, రామపాదుకా రథయాత్ర, ఇంటింటా రామజ్యోతి.. ఇలా జనజాగరణ కార్యక్రమాలు జరిగాయి. హిందూ సమాజాన్ని జాగ్రత్తచేశాయి.
*1990లో మొదటి కరసేవ, ఈ సమయంలో మరొకసారి హిందువులు రక్త తర్పణాలు చేశారు.
* 1992వ సంవత్సరం భారతమాత ముఖం పైన ఉన్న కళంకం. బాబర్ కట్టిన కట్టడం కూల్చివేత.. ఈ సమయంలో మన కుటుంబం నుండి రాము లక్ష్మణ్ విశ్వనాథం అన్నయ్య పాల్గొన్నారు.
* 20 లక్షల మందికి పైగా పాల్గొన్న సభ. చరిత్ర గతిని మార్చిన ఢిల్లీ ‘బోట్స్ క్లబ్’ ర్యాలీ.. 1994 ఏప్రిల్ 4వ తేదీన జరిగింది.
* 2019లో బాల రాముడికి.. హిందువులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, మందిర నిర్మాణం సుగమమైంది
*2022 వ సంవత్సరం భూమి పూజ,
* 2024వ సంవత్సరం బాలరాముడి విగ్రహ ప్రతిష్ట.
* 2025 వ సంవత్సరం మొదటి అంతస్తులో శ్రీరామదర్బార్ ఏర్పాటు. నవంబర్ 25వ తేదీన పరమ పూజనీయ సర్ సంఘచాలకులు మోహన్ భాగవత్, భారత ప్రధాని నరేంద్ర భాయ్ మోదీ పరమ పవిత్రమైన భగవద్వజాన్ని ఎగురవేశారు.
2026 ఉగాది మార్చి 19వ తేదీన మందిర నిర్మాణం పూర్తయిన దానికి గుర్తుగా శ్రీరామయంత్రాన్ని ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. ఈ అద్భుతమైన కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు,
ఈ శుభ సందర్భంలో పాల్గొనవలసిందిగా నాకు ఆహ్వానం అందింది. దానితో గత పోరాటాలు ఒక్కటొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. అనేక అపజయాలు… మరెన్నో విజయాలు. పోరాటం చేసి గెలుపును సాధించిన మన జాతిచరిత్ర గుర్తుకొస్తుంటే ఒళ్ళు పులకరిస్తున్నది. బాలరామముడు నా కళ్ళల్లో మెరుస్తూ కనిపిస్తుండగా నాగపుర్ నుండి బస్సెక్కాను. మన అందరి తరపున శ్రీరాముల వారి ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంలో పాల్గొనడానికి బయలుదేరాను.

More Stories
పశ్చిమాసియా నుంచి 2.44 లక్షల మంది భారతీయులు తరలింపు
బ్రిక్స్ లో అధ్యక్ష హోదాలో భారత్ కు సవాల్ గా ఇరాన్ యుద్ధం
కాల్పుల విరమణకు మొజ్తాబా ఖమేనీ తిరస్కారం!