మన దేశంలో ఏటా 3.5 లక్షల మంది చిన్నారులు గుండె సంబంధిత సమస్యలతో జన్మిస్తున్నారు. సుమారు లక్ష మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి వారికి శ్రీసత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ వరదాయినిగా నిలుస్తోంది. సిద్దిపేట జిల్లాలోని కొండపాకతో పాటు నయా రాయ్ పూర్(ఛత్తీస్ గడ్), పల్వాల్(హరియాణా), నవీ ముంబయి (మహారాష్ట్ర) లలోనూ ఈ వైద్యాలయాలను నెలకొల్పి ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ ప్రాణం పోస్తున్నారు.
సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో నెలకొల్పిన ఈ ఆసుపత్రుల్లో, పుట్టుకతో గుండె సంబంధ వ్యాధులతో జన్మించే శిశువులకు శస్త్రచికిత్స మొదలుకొని ఔషదాలు ఉచితంగానే సమకూర్చుతున్నారు. వ్యాధి బారిన పడిన చిన్నారితో పాటు ఇద్దరికి భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. మనదేశంతో పాట మరో 14 దేశాలకు చెందిన పిల్లలు ఈ ఆసుపత్రులలో చికిత్స పొందినట్లు సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ తెలిపారు.
కార్పొరేట్ స్థాయి అత్యాధునిక సదుపాయాల మధ రోజుకు 4-5 శస్త్రచికిత్సలు చేసే సదుపాయం ఈ ఆసుపత్రుల్లో ఉంది. అత్యాధునిక 2డి ఎకో వ్యవస్థ ఉంది.
ఈ ఆసుపత్రి వాలంటీర్లు మారుమూల గ్రామాలతో పాటు గిరిజన తండాల్లో శిబిరాలు నిర్వహించి గుండెల్లో లోపాలున్న చిన్నారులను గుర్తిస్తున్నారు. సమస్య తీవ్రతను వారి తల్లిదండ్రులకు విడమర్చి చెప్పి, ఆసుపత్రికి వస్తే ఉచిత చికిత్స అందించే తీరును తెలియజేస్తున్నారు.
కొండపాకలో 2024 నవంబరు 23న హృదయాలయాన్ని ప్రారంభించారు. 233 మంది చిన్నారులకు ఓపెన్ హార్ట్ సర్జరీలు, 103 మంది పిల్లలకు కార్డియాక్ ఇంటర్వెన్షన్లు విజయవంతంగా పూర్తి చేసి 336 మందికి ప్రాణం పోశారు. వంద పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆసుపత్రిలో ఆధునిక వైద్యపరికాలు, నిష్ణాతులైన వైద్యులు, పూర్తిస్థాయి డిజిటల్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు వైద్యసేవలు అందుబాటులో ఉంటాయి.
క్యాథ్ ల్యాబ్(క్యాథెటరైజేషన్ లాబొరేటరీ)లో గుండె సంబంధిత వ్యాధులను గుర్తించొచ్చు. ఇందులోని ప్రత్యేక థియేటర్లో శస్త్రచికిత్సలు చేయొచ్చు. పుట్టుకతో వచ్చే గుండె లోపాలకు మాత్రమే ఇక్కడ చికిత్స అందిస్తారు. అవసరం మేర పీడియాట్రిక్ కార్డియన్ సర్జరీలు చేస్తారు. కొందరు ప్రారంభ దశలోనే గుర్తిస్తుండగా మరి కొందరు ఎదిగేదశలో పసిగడుతున్నారు. ఎదిగిన వారిలో పుట్టుకతో సమస్య ఉంటేనే చికిత్స అందిస్తారు. 80101 19000 చరవాణి సంబరు కాల్ చేసి అపాయింట్మెంటు తీసుకోవచ్చు. వాట్సప్ నంబర్ 70751 37733 లో చాట్ చేసి సైతం అపాయింట్మెంట్ నమోదు చేసుకోవచ్చు.
శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్ కొండపాక్, సిద్దిపేట జిల్లా, తెలంగాణ 502372. సంప్రదింపు నంబర్ (సోమవారం – శనివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది): +91-8010119000 ఇమెయిల్:
info.kondapaka@

More Stories
కేటీఆర్ తో రేవంత్ రెడ్డి కుమ్మక్కు
ప్రస్తుతం హైదరాబాద్ అభివృద్ధి నిలిచిపోయింది
తెలంగాణలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత లేదు