అవినీతిలో కూరుకుపోయిన మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ప్రభుత్వ దుష్పరిపాలన నుంచి పశ్చిమ బెంగాల్ కు విముక్తి చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపిచ్చారు. బంగాల్ ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో పెను మార్పు కోసం తహతహలాడుతున్నారని, నిజమైన ‘పరిబోర్తన్’ (మార్పు) కోసం ఆకాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఆదివారం కూచ్ బెహార్లో పార్టీ చేపట్టిన ‘పరిబోర్తన్ యాత్ర’ ప్రారంభించిన ఆయన, మమతా బెనర్జీ సర్కార్పై విమర్శలు గుప్పించారు.
ఎస్ఐఆర్ చేపట్టి ఓటర్ల జాబితాలోని అక్రమ చొరబాటుదారులను తొలగించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తే, దానిని మమతా బెనర్జీ అడ్డుకునే ప్రయత్నం చేశారని నితిన్ నబీన్ ఆరోపించారు. “మమతా బెనర్జీ తన పార్టీ ఓటు బ్యాంక్ను కాపాడుకోవడం కోసం, ఓటర్ల జాబిలోని చొరబాటుదారులకు రక్షించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారు” అని విమర్శించారు.
అయితే ఈసీ మాత్రం బంగాల్ యువత ఉద్యోగులను కొల్లగొడుతున్న సుమారు 50 లక్షల మందికిపైగా అక్రమ చొరబాటుదారుల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలచిందని, రాష్ట్రంలో అక్రమ వలసదారుల కాలం చెల్లిందని ఆయన స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ పూర్తి చేసిన తర్వాత బెంగాల్ ఓటర్ జాబితా నుంచి 63.66 లక్షల పేర్లను తొలగించినట్లు ఈసీ ఇంతకు ముందే ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
“వాస్తవానికి ఓటర్ జాబితా నుంచి తొలగించబడిన వారంతా చొరబాటుదారులే. వారు అసలైన పౌరులకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలను, సంక్షేమ పథకాల ప్రయోజనాలను అక్రమంగా అనుభవిస్తున్నారు. పైగా వాళ్లు దేశభద్రతకు ముప్పుగా పరిణమించారు. మమతా బెనర్జీ అక్రమ చొరబాటుదారుల కోసం నకిలీ పత్రాలు సృష్టించి రక్షణ కల్పించారు” అని ఆయన ధ్వజమెత్తారు.
కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు కేవలం చొరబాటుదారులను రాష్ట్రం నుంచి తరిమి వేయడమే కాకుండా, బెంగాల్లోని అభివృద్ధిని పరుగులు పెట్టించే ఒక నిర్ణయాత్మక ప్రభుత్వాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపిచ్చారు.
“మమతా బెనర్జీ ఓటర్ల జాబితాలోని చొరబాటుదారులను కాపాడుకోవడం కోసం కోర్టులకు పరుగులు తీశారు. ఎందుకంటే వారే ఆమె పార్టీకి ఓటు బ్యాంక్. కానీ రాష్ట్రంలో మహిళలు అవమానాలకు గురవుతుంటే మాత్రం, ఆమె కళ్లు మూసుకున్నారు” అని నితిన్ ఆరోపించారు. చొరబాటుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ‘బంగాల్ నుంచి మిమ్మల్ని తరిమేసే సమయం ఆసన్నమైంది’ అని ఆయన హెచ్చరించారు.

More Stories
యుఎఇకి ప్రధాని మోదీ సంఘీభావం
రాజ్యసభకు తొలిసారి ఎల్జీబీటీ మేనకా గురుస్వామి
ఇకపై హార్డ్వేర్ రంగంలోనూ భారత్ సత్తా