అమెరికాను కమ్మేసిన మంచు తుపాను

అమెరికాను కమ్మేసిన మంచు తుపాను
అమెరికా ఈశాన్య ప్రాంతాన్ని సోమవారం మంచు తుఫాను ముంచెత్తింది. న్యూయార్క్‌ నగరం మొదలు మసాచుసెట్స్‌ దాకా 8 రాష్ర్టాల్లో మంచు తుఫాన్‌ కమ్మేసింది. మేయర్‌ మమ్దానీ న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ విధించారు. లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజా రవాణా వ్యవస్థ స్థంభించింది.  దాదాపు 5 లక్షలకు పైగా ఇండ్లు, ఇతర కార్యాలయాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
మసాచుసెట్స్‌లో ‘వైట్‌ ఔట్‌’ పరిస్థితులు నెలకొన్నందున రోడ్లపైకి రావొద్దని వాహన డ్రైవర్లను ఆదేశించారు. ఆదివారం, సోమవారం మన్‌హట్టన్‌ సెంట్రల్‌ పార్క్‌లో 50 సెంటీమీటర్ల మేర మంచు కురిసింది. పలు రాష్ర్టాల్లో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయింది. దేశీయ విమానాలతో సహా దాదాపు11 వేల విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయాలు ఖాళీగా మారాయి. స్కూళ్లు మూతపడ్డాయి. భారీ హిమపాతం, బలమైన చలిగాలులతో జన జీవనం స్థంభించింది. 
 
రద్దీగా ఉండే టెర్మినల్స్ నిర్మానుష్యంగా మారాయి. ఈ ప్రాంతం అంతటా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్ తీవ్రత నేపథ్యంలో ముందుగానే విమానయాన సంస్థలు ముందస్తుగా విమాన సేవలను రద్దు చేశాయి. న్యూయార్క్ లోని జెఎఫ్ కె , లాగ్వార్డియా విమానాశ్రయాలు, బోస్టన్ లోగన్, న్యూవార్క్ లిబర్టీ వంటి ప్రధాన కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడింది. రైళ్లు, బస్సు నెట్ వర్క్ కు బంద్ అయ్యాయి. చాలా రాస్త్రాలలో సేవలు నిలిచి పోయాయి. 
 
దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. చాలా ప్రాంతాలలో అధికారులు ప్రయాణ ఆంక్షలు విధించారు న్యూయార్క్ నగరం లో సోమవారం మధ్యాహ్నం వరకూ ప్రయాణాలను నిషేధించగా, న్యూయార్క్ స్టేట్, న్యూజెర్సీ, రోడ్ ఐలాండ్ లొన్ని కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఆదేశాలు జారీ అయ్యాయి. న్యూయార్క్ నగరం లోని రోడ్లపై దట్టంగా మంచు పోగుపడింది. దానిని తొలగించేందుకు నిర్విరామంగా సిబ్బంది కష్టపడుతున్నారని మేయర్ అన్నారు.


న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ లో సోమవారం ఉదయం 15 అంగుళాల కంటే ఎక్కువ మంచు నమోదైంది. లాంగ్ ఐలాండ్, న్యూజెర్సీ లో అంతటా అధికమంచు నమోదైంది. బోస్టన్, ఫిలడెల్ఫియాలోనూ అదే పరిస్థితి. గంటకు 35 మైళ్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయ. డెలావేర్, మసాచుసెట్స్ లో 40- 60ఎంపిహెచ్ వేగంతో గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా 5 లక్షల70 వేల ఇళ్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మాసాచ్యుసెట్స్ , న్యూజెర్సీలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.