దేశంలో అర్హత లేని నకిలీ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించింది. ఆ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది. వీటిలో చదివే, చదవాలనుకొనే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేసే యూజీసీ దేశంలో కొనసాగుతున్న యూనివర్సిటీల అర్హతలపై సమీక్ష చేస్తుంది. ఈ సంస్థలు చట్టబద్ధ గుర్తింపు లేకుండా డిగ్రీలు జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నకిలీ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. ఉద్యోగాలకు లేదా ఉన్నత చదువులకు ఈ విశ్వవిద్యాలయాలు జారీ చేసే ధృవపత్రాలు పనికిరావని తేల్చి చెప్పింది. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు లేని ఈ సంస్థలు డిగ్రీలు జారీ చేసే అధికారం కలిగి లేవని తెలిపింది. విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందడానికి ముందే ఆయా సంస్థల గుర్తింపును విద్యార్థులు తనిఖీ చేసుకోవాలని కీలక సూచనలు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో అత్యధికంగా 12 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని యూజీసీ వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 4 నకిలీ యూనివర్సిటీలు ఉన్నట్లు గుర్తించింది. యూజీసీ చట్టంలోని సెక్షన్ 2(ఎఫ్), 3 ప్రకారం.. ఢిల్లీ 12, ఉత్తర్‌ప్రదేశ్ 4, ఆంధ్రప్రదేశ్ 2, కర్ణాటక 2, కేరళ 2, మహారాష్ట్ర 2, పుదుచ్చేరి 2, పశ్చిమ బెంగాల్ 2.. అరుణాచల్ ప్రదేశ్ 1, హర్యానా 1, జార్ఖండ్ 1, రాజస్థాన్ 1 యూనివర్సిటీ ఉందని యూజీసీ వెల్లడించింది.
ఢిల్లీలోని కొన్ని ముఖ్యమైన యూనివర్సిటీలు
- యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ
- వొకేషనల్ యూనివర్సిటీ
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
- ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం
- కర్ణాటక బెంగళూరులోని గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ
- కేరళలోని సెయింట్ జాన్స్ యూనివర్సిటీ
- మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని రాజా అరబిక్ యూనివర్సిటీ
- ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని గాంధీ హిందీ విద్యాపీఠ్
- ఉత్తర్‌ప్రదేశ్ అలీఘర్‌లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఓపెన్ యూనివర్సిటీ

More Stories
ఉగ్రవాద ఆరోపణలపై ఆరుగురు ఉక్రెయిన్ల అరెస్ట్
ఢిల్లీలో పాకిస్థాన్ లింక్డ్ గూఢచర్య ముఠా గుట్టురట్టు
ఒడిశాలో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది నక్సల్స్ లొంగుబాటు