ఫోరెన్సిక్​ ల్యాబ్​ అగ్ని ప్రమాదం డేటా రికవరీ కష్టమే

ఫోరెన్సిక్​ ల్యాబ్​ అగ్ని ప్రమాదం డేటా రికవరీ కష్టమే
నాంపల్లి ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​లో ఇటీవల జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో  మొత్తం 1,100 ఫైల్స్​ దగ్ధం అయినట్లు నాగ్​పూర్​ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం గుర్తించింది. ఈ దగ్ధమైన ఫైల్స్​లోని డేటా రికవరీ కోసం ఆ బృందం ఎంతో తీవ్రంగా ప్రయత్నించి, రికవరీ చేయడం కష్టమని ప్రత్యేక తేల్చి చెప్పింది. ఈ ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​లో వివిధ కేసుల దర్యాప్తులో ఎఫ్​ఎస్ఎల్​ కీలక పాత్ర పోషిస్తుంది.

ఇందులో వెంట్రుకలు, ఎలక్ట్రానిక్​ డివైజ్​ల విశ్లేషణ, రక్తం, వేలిముద్రలు, బుల్లెట్లు, లేదా డీఎన్​ఏ నమూనాలు, ఆయుధాలు, డాక్యుమెంట్లు ఫోర్జరీ జరిగాయా లేదా ప్రతీది ఇతర అన్ని ఆధారాలను ల్యాబ్​లోనే పరిశీలించి నివేదికలు సిద్ధం చేస్తారు.  ఈ ఆధారాలు ఎన్నో కోర్టు తీర్పుల్లో కీలకంగా ఉంటాయి. కానీ ఈ ప్రమాద ప్రభావం వల్ల కేసుల దర్యాప్తుపై ఎంత వరకు పడనుందనేది ఆందోళనకరమైన విషయం.

హైదరాబాద్ నాంపల్లిలోని ఫిబ్రవరి 7న ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబ్​లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ ఎన్నో కీలక కేసులకు సంబంధించి సున్నితమైన డేటా ధ్వంసమైంది.  ఈ అగ్ని ప్రమాదంలో మొదటి అంతస్థులోని కంప్యూటర్లు, ఫిజికల్​ ఎవిడెన్స్​ సహా ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో అత్యంత కీలకమైనది ఎఫ్​ఎస్​ఎల్​ సంస్థ. ఇది జరిగిన నేరాలకు సంబంధించిన ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి నివేదికలు సమర్పిస్తుంది.  కోర్టు తీర్పుల్లో కీలకంగా ఉండేవి ఈ ఆధారాలే. వాటిలో ముఖ్యమైన ఫైళ్లు, కంప్యూటర్లు, కీలక ఆధారాలు, హార్డ్ ​డిస్కులు, ఎలక్ట్రానిక్​ పరికరాల్లో మంటలు రావడంతో దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత నాంపల్లి ఫోరెన్సిక్​ సైన్స్​ ల్యాబొరేటరీ (ఎఫ్​ఎస్​ఎల్​)లో జరిగిన ఘటనపై కేసు నమోదైంది. 

మొదటగా ప్రాపర్ట్​ రూమ్​లోకి భారీగా పొగతో కూడిన మంటలు వ్యాపించాయని ఆ తర్వాత ఇతర గదులకు వచ్చాయని తెలిపారు. ఈ ప్రమాదం ఫిబ్రవరి 7వ తేదీన ఉదయం 10.08 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో కంప్యూటర్​ ఫోరెన్సిక్​ ల్యాబ్​, కేసు వెరిఫికేషన్​ ఛాంబర్​, ప్రాపర్టీ రూమ్​, సర్వర్​ రూమ్​, హెచ్​ఆర్​డీ హాల్​, అనాలసిస్​ ఛాంబర్​తో పాటు ఫర్నిచర్​ పరికరాలు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయని వివరించారు.