మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ ఆయుష్ మాత్రే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే 14 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ (175 పరుగులు)తో స్కోర్ను పరుగులెత్తించాడు. ఇందులో 15 సిక్స్లు, 15 ఫోర్లు ఉన్నాయి. దీనితో ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీ సాధించిన రెండో ఆటగాడుగా వైభవ్(55 బంతుల్లో) నిలిచాడు.
(ఆసీస్ బ్యాటర్ విల్(51 బంతులు) ఇదే సిరీస్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదడం గమనార్హం.) మరోవైపు కెప్టన్ ఆయుష్ మాత్రమే బాధ్యతాయుతంగా ఆడి 51 బంతుల్లో 53 పరుగులు (2 సిక్స్లు, 7 ఫోర్లు) చేశాడు. కనిష్క్ చౌహాన్ చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించి 20 బంతుల్లో 37 పరుగులు చేసి, స్కోర్ను 400 దాటించాడు. ఇక వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30), అభిజ్ఞాన్ కుందు (40) కూడా బాగానే ఆడారు.
దీనితో నిర్ణీత 50 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా బాగానే పోరాడింది. కానీ భారత్ దెబ్బకు ఆ జట్టు 311 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ ఆటగాడు కేలెబ్ ఫాల్కనర్ ఒంటరి పోరాటం చేస్తూ 67 బంతుల్లో 115 పరుగులు (9 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.
భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ కీలక వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ఆర్‌ఎస్ అంబరీష్, కెప్టెన్ ఆయుష్ మాత్రే కూడా కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ అండర్-19 క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుంది. టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచిన టీమ్ ఇండియా ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగించి వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది.

More Stories
యూనస్ ఇంటి ముందు హింసాయుత ప్రదర్శనలు
అమెరికా ప్రమాదకరమైన నేరగాళ్లలో 80 మంది భారత సంతతి
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడిలో 70 మందికి పైగా మృతి!