తెలంగాణాలో బిజెపి గెలుపొందే మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నుల పెంపూ ఉండదని, ఆన్ లైన్, సింగిల్ విండోసింగిల్ సిస్టం ద్వారా వారం రోజులలో ఇంటి అనుమతులు ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది. “వికసిత్ తెలంగాణ – బిజెపి సంకల్ప పత్రం 2026” పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బీజేపీ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల సహ ఇంచార్జులు అశోక్ పర్ణామి గారు, రేఖా శర్మ లతో కలిసి ఆవిష్కరించారు.
అవినీతి రహిత పాలన, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులను పూర్తిస్థాయిలో ప్రజల అభివృద్ధికే వినియోగించడం, ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా సమర్థవంతమైన పాలనా వ్యవస్థను అమలు చేయడం ఈ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని తెలిపారు. మున్సిపాలిటీలలో ఎలాంటి అవినీతికి తావుండదని, ప్రభుత్వ లేదా మున్సిపల్ భూముల ఆక్రమణలు, నిధుల మళ్లింపుకు (డైవర్షన్) ఎటువంటి అవకాశం ఉండదని స్పష్టంగా చెప్పారు.
మేనిఫెస్టోలో యువత కేంద్రంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, జాబ్ ట్రైనింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే ప్రతి మున్సిపాలిటీని మోడల్ నగరంగా అభివృద్ధి చేయడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తామని రాంచందర్ రావు గారు వెల్లడించారు.
సీనియర్ సిటిజన్స్, యువతకు అనుకూలంగా ప్రతి మున్సిపాలిటీలో వాకింగ్ ట్రాక్స్, ఆధునిక సదుపాయాలతో కూడిన పార్కులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కొన్ని పార్కులను యూటిలిటీ పార్కులుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలలో ఎల్ఈడి వీధి దీపాలు, చెత్త, వ్యర్థాల సేకరణ, వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపారు.
ఇవి సమగ్ర, పారదర్శక నగరాల రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు వంటి అన్ని సౌకర్యాలను అత్యున్నత ప్రమాణాలతో అందించడమే ప్రధానంగా తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ భూములు, మున్సిపల్ భూములపై ఎక్కడైనా ఆక్రమణలకు అవకాశముంటే అడ్డుకుంటామని, కబ్జాలకు పాల్పడితే వాళ్లెవరైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.
ఫైనాన్స్ కమిషన్ ద్వారా అర్బన్ లోకల్ బాడీస్‌కు వచ్చే నిధులను పూర్తిగా, పారదర్శకంగా వినియోగిస్తామని, ఎలాంటి డైవర్షన్ ఉండదని చెప్పారు.
మేనిఫెస్టోలో సంపూర్ణ హామీలు, మౌలిక సదుపాయాలు, ఉపాధి, విద్య, వైద్య సేవలు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, డిజిటల్ సేవలు వంటి అన్ని అంశాలు ఉన్నాయి.
ఇటీవలి రోజుల్లో తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని రామచందర్ రావు విమర్శించారు. రామగుండంలో అభ్యర్థిని బెదిరించి విత్‌డ్రా చేయించిన ఘటన, మంచిర్యాలలో కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగిన విషయాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను తమ కార్యకర్తల మాదిరిగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
ఇటీవలి రోజుల్లో తెలంగాణలో పోలీసు వ్యవస్థను ఉపయోగించి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరుగుతున్నాయని రామచందర్ రావు విమర్శించారు. రామగుండంలో అభ్యర్థిని బెదిరించి విత్‌డ్రా చేయించిన ఘటన, మంచిర్యాలలో కార్యకర్తల ఇళ్లపై దాడులు జరిగిన విషయాలను ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను తమ కార్యకర్తల మాదిరిగా ఉపయోగించుకుంటోందని మండిపడ్డారు.
కర్ణాటకలో తీసుకొచ్చిన హేట్ స్పీచ్ బిల్లును అనుకరిస్తూ, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం బీజేపీ నేతలు, కార్యకర్తలను ఇరికించేందుకు, అక్రమంగా కేసులు బనాయించేందుకు మాత్రమే ఉద్దేశించినదని ఆయన విమర్శించారు.

More Stories
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల
యూనస్ ఇంటి ముందు హింసాయుత ప్రదర్శనలు
గడ్చిరోలిలో ఏడుగురు మావోయిస్టులు మృతి