మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా బిజెపి నామినేషన్లు!

మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్లా బిజెపి నామినేషన్లు!

తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లు, 2996 వార్డులు,  డివిజన్లలో భారతీయ జనతా పార్టీ వందశాతం అన్ని స్థానాల్లో పోటీకి నామినేషన్లు దాఖలు చేసిన్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. అందుకు సంబంధించి అభ్యర్థులకు బీ-ఫారమ్ కూడా పంపించామని చెప్పారు. ఇంతకు ముందు ఎంపీ,ఎమ్మెల్సీ, సర్పంచ్ గ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బిజెపి పట్ల చూపిన విశ్వాసాన్ని గమనించి, ప్రతి స్థానంలో పోటీ చేస్తున్నామని, అభ్యర్థులు అందరూ . బిజెపి ఎన్నికల గుర్తుతోనే పోటీ చేస్తున్నారని ఆయన తెలిపారు.

బీఆర్ఎస్ తో పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఒకే దారిలో వెళ్ళి, గతంలో చేసిన స్కామ్స్‌ను కొనసాగిస్తూ ప్రజల నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా మున్సిపాలిటీస్‌లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ద్వారా లక్షలాది ప్రజలను బాధపడే పరిస్థితిలో పెట్టిందని చెప్పారు.

చిన్న ప్లాట్ కోసం రూ. 1,000 రూపాలు, పెద్ద ప్లాట్ కోసం రూ.10,000  ఫీజు వసూల్ చేయడం ద్వారా, .దాదాపు 25.67 లక్షల అప్లికేషన్లకు రూ 250 కోట్ల మేరకు ఆదాయం పొందినా  ప్రజలకు అందిన లాభం కేవలం 10% మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. ఫీజులు వసూలు చేసినప్పటికీ, న్యాయపరమైన సమస్యలు, బకాయిల కారణంగా స్కీమ్ నిలిచిపోయిందని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20% మాత్రమే ఫీజులు ప్రభుత్వానికి సమర్పించబడేలా చేసిందని పేర్కొన్నారు.

ఇప్పటికీ ల్యాండ్ రెగ్యులేషన్ అమలు కాలేదు, ఫలితంగా లక్షలాది ప్రజలు అన్యాయంగా ఎదురుచూస్తున్నారని రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 15 రోజుల్లో రెగ్యులేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని, ప్రజలకు న్యాయం చేయాలని, ఫీజులు వసూలు చేసినా అమలు కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ మొత్తం మున్సిపాలిటీస్‌లో పరిపాలన సరిగ్గా లేదని,  ఫైరింగ్, రేప్స్, డ్రగ్స్, దొంగతనాలు వంటి సంఘటనలు ప్రతి రోజూ చోటుచేసుకుంటున్నాయని బీజేపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు, చిన్న అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కూడా మౌలిక సదుపాయాలు సరియైన రీతిలో అందడం లేదని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీలు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులు. పథకాలపై ఆధారపడి నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

నల్గొండలో గతంలో బిజెపి  నాయకులు మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించారని, బోనగిరిలో కూడా వైస్ చైర్మన్ గా గెలిచారని ఆయన గుర్తు చేశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ వంటి పార్టీలు ప్రజల నమ్మకాలను వమ్ము చేస్తూ దారితప్పాయని, ఇప్పటికే ఆ పార్టీలు మునిగిపోతున్నాయని పేర్కొంటూ తెలంగాణాలో బీజేపీ ప్రజల సమస్యలను పరిష్కరించి, బలమైన నాయకత్వాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.