ఈయు (ఐరోపా సమాఖ్య)తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ వద్ద ప్రధాని మీడియాతో మాట్లాడుతూ ఐరోపా సమాఖ్య (ఇయు) తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికమని హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులకు పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
రాష్ట్రపతి ప్రసంగం ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించిందని పేర్కొంటూ ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అని, అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళుతోందని తెలిపారు. వికసిత్ భారత్ కోసం ఎంపి లు కృషి చేయాలని మోదీ కోరారు. ప్రస్తుతం భారత్ రీఫార్మ్ ఎక్స్‌ప్రెస్‌లో ముందుకెళ్తోందని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందని చెప్పారు.
అలాగే సాంకేతికత మనుషులకు ప్రత్యామ్నాయం కాదని ప్రధాని స్పష్టం చేశారు. పెండింగ్ సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండటంతో భారత్‌ను సుస్థిర దేశంగా ప్రపంచం చూస్తోందని తెలిపారు. ట్రేడ్‌డీల్‌తో కొత్త మార్కెట్ అవకాశాలు అందుబాటులోకి వస్తాయనీ, వాటినుంచి తయారీదారులు లబ్ధి పొందాలని కోరుతున్నానని ఆయన పేర్కొన్నారు.
ఈయూలోని 27 దేశాలకు నాణ్యమైన ఉత్పత్తులు అందించాలని చెప్పారు. ‘‘మనం టెక్నాలజీతో పోటీపడతాం. దానిని అందిపుచ్చుకుంటాం. దాని సామర్థ్యాన్ని అంగీకరిస్తాం. అయితే అది మనుషులను భర్తీ చేయలేదు’’ అని మోదీ స్పష్టం చేశారు. భారత తయారీ రంగానికి ఆ ఒప్పందం గొప్ప అవకాశమని ప్రధాని మోదీ అన్నారు. ముఖ్యంగా దేశీయ తయారీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సామర్థ్యాలను పెంచుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లలో మరింత స్థానం దక్కుతుందని, ఇది భారత్‌కు కొత్త శక్తినిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు సహజమని, అయినప్పటికీ దేశ హితమే అందరి లక్ష్యంగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ఫైళ్లకే పరిమితం కాకుండా ప్రజల జీవితాల్లోకి వెళ్లాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు.
దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో అడ్డంకులు సృష్టించడం కాదని, పరిష్కారాలపై దృష్టి పెట్టాల్సిన సమయమిదని ప్రధాని సూచించారు. “ఇది అడ్డంకుల సమయం కాదు, పరిష్కారాల సమయం. చివరి వ్యక్తికి లబ్ధి చేర్చే దిశగా మనం ముందుకెళ్లాలి” అంటూ ఎంపీలకు పిలుపునిచ్చారు. “ఇది అడ్డంకుల సమయం కాదు, పరిష్కారాల సమయం. చివరి వ్యక్తికి లబ్ధి చేర్చే దిశగా మనం ముందుకెళ్లాలి” అంటూ ఎంపీలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ మానవ కేంద్రితంగా ఉంటాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

More Stories
యుజిసి కొత్త నిబంధనలు ‘సమాజాన్ని చీల్చే ప్రమాదం’.. `సుప్రీం’ స్టే
అశ్రునయనాల మధ్య అజిత్ పవార్ అంత్యక్రియలు
అజిత్ పవార్ మరణంలో కుట్ర లేదు